Slider ముఖ్యంశాలు సంపాదకీయం

భారత్ ఉగ్రవాద దేశం- వంట మనిషి సాక్ష్యం

imrankhan

దొంగే దొంగా దొంగా అని అరిస్తే ఎలా ఉంటంది. ఎలా ఉంటుందో పాకిస్తాన్ ఈ ప్రపంచానికి చెబుతున్నది. జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత్ నిర్ణయం తీసుకున్న నాటి నుంచి మతి తప్పి ప్రవర్తిస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు భారత్ ను ఏ విధంగా టార్గెట్ చేయాలా అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. అదేమిటంటే భారత్ కు చెందిన కొందరు ఉగ్రవాదులకు హెల్ప్ చేస్తూ పాకిస్తాన్ లో టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నారని ముద్ర వేయడం.

ఈ మేరకు ఇటీవలె ఇద్దరిపై  ఉగ్రవాదులకు హెల్ప్ చేస్తున్నారనే ముద్ర వేసింది. అంతకు ముందు కుల్ భూషన్ జాదవ్ ను కూడా ఇదే విధంగా అంతర్జాతీయ ఉగ్రవాదిగా పాకిస్తాన్ న్యాయస్థానాలు నిర్ణయించి ఉరి శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ శిక్షను అంతర్జాతీయ కోర్టు కొట్టేసి పూర్తి వ్యవహారాలను మరింత కూలంకషంగా చర్చించాలని పాకిస్తాన్ కు చెప్పిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో ఇప్పుడు భారత్ కు చెందిన అజయ్ మిస్త్రీ అనే వంటవాడిని ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నాడనే కేసులో పాకిస్తాన్ ఇరికిస్తున్నది.

ఇరికించడమే కాదు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 1267 తీర్మానం ( ఆల్ ఖైదా ఆంక్షల కమిటీ) ద్వారా ప్రస్తావించింది. నేరుగా పాకిస్తాన్ ఆ పని చేయలేదు కాబట్టి చైనా ద్వారా ఈ తీర్మానాన్ని ప్రతిపాదించింది. పాకిస్తాన్ చేస్తున్న ఈ ప్రయత్నాలకు చైనా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నది. మహాబలిపురం తీసుకెళ్లి భారత్ గొప్పతనాన్ని మోడీ చైనా అధ్యక్షుడికి చూపిస్తే చైనా మాత్రం తన వికృత రూపాన్ని పాకిస్తాన్ కు సహాయం చేయడం ద్వారా ప్రదర్శిస్తున్నది.

భారత్ కు చెందిన కొందరు అంతర్జాతీయ ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నారని చైనా అండతో పాకిస్తాన్ కేసులు నమోదు చేస్తున్నది. ఈ కేసులను అంతర్జాతీయ వేదికలపైన చైనా సహాయంతో ఉంచుతున్నది. కోల్ కతా కు చెందిన వంటవాడు అయిన అజయ్ మిస్త్రీ 2016 నుంచి 2018 వరకూ అబుదాబీలో వంట పనికి వెళ్లాడు. అక్కడ తన పని తాను చేసుకునేవాడు. అయితే పాకిస్తాన్ కు మాత్రం అతడు ఒక టెర్రరిస్టులాగా కనిపించాడు.

అజయ్ మిస్త్రీ కి ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టు సంస్థ ఐఎస్ఐఎల్-ఖొర్సన్ లతో సంబంధాలు ఉన్నాయని పాకిస్తాన్ చెబుతున్నది. ఆఫ్ఘనిస్థాన్ లో ఉగ్రవాదులను తయారు చేసేందుకు మిస్త్రీ ఐఎస్ఐఎల్-ఖొర్సన్ తో కలసి పని చేస్తుంటాడట. సిరియా, ఇరాక్ నుంచి ఉగ్రవాదలు ఆఫ్ఘనిస్థాన్ కు సురక్షితంగా చేరే విధంగా ఈ మిస్త్రీ సహకరిస్తుంటాడనేది పాకిస్తాన్ అభియోగం. పాకిస్తాన్ లోని కాల్యా బజార్, ఓరాజియా, ఖైబర్ ఫక్తూన్ వాలా ప్రాంతాలలో ఉగ్రవాదుల దుశ్చర్యలకు మిస్త్రీ సహకరించాడట. ఈ దాడులలో 31 మంది చనిపోవడానికి మిస్త్రీ కారణమని పాకిస్తాన్ అభియోగం. అబుదాబీలో వంటవాడిగా పని చేసే మిస్త్రీకి భారత్ పాస్ పోర్టు ఉందని అందువల్ల భారత్ ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని పాకిస్తాన్ కోరుతున్నది.

పాకిస్తాన్ ఈ విధమైన కేసులు నమోదు చేయబోతున్నట్లు ముందు తెలుసుకున్న భారత్ నిఘా వర్గాలు మిస్ర్తీని భారత్ కు తీసుకువచ్చాయి. కోల్ కతా లోని ఆయన స్వగ్రామానికి ఆయన చేరుకున్నాడు. ఈ ఉదంతాన్ని ఉటంకిస్తూ భారత్ ఉగ్రవాదులకు రక్షణ కల్పిస్తున్నదని పాకిస్తాన్ వాదిస్తున్నది. మిస్త్రీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని కోరుతూ పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వద్దకు పాకిస్తాన్ చైనా సాయంతో వెళ్లడం దొంగే దొంగా దొంగా అని అరుస్తున్నట్లుగా ఉంది.

అంతకు ముందు ఆఫ్ఘనిస్థాన్ లో కమ్యూనికేషన్ విభాగంలో ఇంజనీర్ గా పని చేస్తున్న వేణు మాధవ్ డోంగ్రా ను కూడా పాకిస్తాన్ ఇదే విధంగా అంతర్జాతీయ టెర్రరిస్టుగా ముద్ర వేసింది. అతని పై కూడా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చైనా ద్వారా తీర్మానం పెట్టించింది. అయితే ఈ తీర్మానాన్ని అమెరికా ఆదిలోనే అడ్డుకున్నది. ఈ విధంగా మరో నలుగురిపైన పాకిస్తాన్ ఉగ్రవాద ఆరోపణలు చేయబోతున్నట్లు భారత నిఘావర్గాల గుర్తించాయి. వారిని అప్రమత్తం చేశాయి. పాకిస్తాన్ చైనా ద్వారా ఇలాంటి కుట్రలు పన్నడం శోచనీయం. భారత్ తో స్నేహ హస్తం చాస్తూనే పాకిస్తాన్ కపట నాటకాలకు సహకరించడం చైనా ఇప్పటికైనా మానుకోవాలి.

Related posts

పరవాడ ఫార్మాసిటీలో మరో ప్రమాదం

Satyam NEWS

భార్య మరణాన్ని కోవిడ్ ఖాతాలో వేద్దామనుకున్నాడు

Satyam NEWS

‘ఐ రా స’ లో మన స్థానం?

Satyam NEWS

Leave a Comment