30.2 C
Hyderabad
September 14, 2024 17: 32 PM
Slider ప్రత్యేకం ప్రపంచం

పాకిస్తాన్ లో మళ్లీ సైనిక పాలన తప్పదా?

qamar bajwa

దారుణమైన ఆర్ధిక మాంద్యంలో చిక్కుకుని విలవిల లాడుతున్న పాకిస్తాన్ లో మళ్లీ సైనిక పాలన రానున్నదా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు త్వరలోనే పదవీ గండం పొంచి ఉన్నట్లు అర్ధమౌతున్నది. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ పలు రకాలుగా వత్తిడులు ఎదుర్కొంటున్నది. జమ్మూకాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాయింట్ లేకుండా పోరాడుతున్న ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ ప్రజల దృష్టిలో చులకన అయిపోయాడు. అదే సమయంలో ఆయన చెప్పినవన్నీ అసత్యాలుగా నిరూపణ అవుతుండటంతో ఆ దేశ ప్రతిష్ట కూడా అంతర్జాతీయంగా మంటగలిసి పోతున్నది. తమకు ఐక్యరాజ్య సమితిలోని 49 దేశాలు మద్దతు ఇచ్చాయని, ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించాయని పాకిస్తాన్ ప్రధాని చెప్పిన మాటలు అపహాస్యం అయ్యాయి. ఈ పరిస్థితుల్లో దేశంలో నెలకొని ఉన్న ఆర్ధిక మాంద్యం తీవ్ర రూపం దాల్చింది. తీవ్ర రూపం దాల్చిన ఆర్ధిక మాద్యం నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆ దేశానికి చెందిన టాప్ బిజినెస్ పీపుల్ పాకిస్తాన్ సైనికాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే మూడు దఫాలుగా జరిగిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ క్వమర్ జావేద్ బాజ్వా ఆ దేశ ప్రధాన వ్యాపారవేత్తల  సమావేశాలు ఆసక్తి రేపుతున్నాయి. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిష్క్రియాపరత్వాన్ని వ్యాపారవేత్తలు ప్రధాన సైనిక అధికారి ముందు ఏకరవు పెట్టారు. లాహోర్ లో, రావల్పిండిలో, కరాచీలో మూడు దఫాలుగా వ్యాపారవేత్తలు బాజ్వాతో సమావేశమయ్యారు. ఏ విధంగా చేస్తే ఆర్ధిక మాంద్యం నుంచి తప్పించుకుంటామని బాజ్వా వారిని కోరినట్లు పాకిస్తాన్ కు చెందిన వార్తా పత్రికలు వెల్లడించాయి. పాకిస్తాన్ ఏర్పడిన నాటి నుంచి ఎన్నో సైనిక చర్యలకు కేంద్రబిందువైన ఆ దేశ రాజకీయ వ్యవస్థ మళ్లీ ఆ దిశగా పయనిస్తున్నట్లుగా అనిపిస్తున్నది. ఇమ్రాన్ ఖాన్ ప్రభావవంతమైన పాలన చేయలేకపోతున్నారని పాకిస్తాన్ లో సర్వత్రా వినిపిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అక్కడి టాప్ టెన్ వ్యాపార వేత్తలతో సమావేశం కావడం చర్చనీయాంశమైంది.

Related posts

పవన్‌కు వాలంటీర్ల సెగలు: రాష్ట్రవ్యాప్తంగా దిష్టి బొమ్మలు దగ్ధం

Satyam NEWS

స‌త్యం వారి ఆచ‌ర‌ణ‌, శాంతి వారి సందేశం,ప్రేమ వారి స్వ‌రూపం….!

Satyam NEWS

ధరణి తో లక్షల కోట్ల కుంభకోణం

Bhavani

Leave a Comment