34.2 C
Hyderabad
April 19, 2024 22: 55 PM
Slider ప్రపంచం

పాకిస్తాన్ మల్టీ లాంచ్ రాకెస్ట్ సిస్టం ప్రయోజం విజయవంతం

#PakistanRocket

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మల్టీ లాంచ్ రాకెట్ సిస్టం ను పాకిస్తాన్ విజయవంతంగా పరీక్షించింది. శత్రుదేశాలలోని సైనిక స్థావరాలపై ప్రయోగించేందుకు దీన్ని రూపొందించినట్లు పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ అధికార ప్రతినిధి ప్రకటించారు.

ఈ అధునాతన ఆయుధం సమకూరడంతో పాకిస్తాన్ సైనిక పాటవం మరింత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అధునాతన రాకెట్ లాంచ్ సిస్టం ప్రయోగించిన అస్త్రాలను శత్రువులు ఛేదించడం సాధ్యం కాదని లక్ష్య సాధనలో ఇది గురి తప్పదని పాకిస్తాన్ రక్షణ రంగ నిపుణుడు సయ్యద్ మొహమూద్ అలీ తెలిపారు.

150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఇది చేరుకోగలదు. ఇటీవల భారత్ అధునాతన ఆయుధాలను సమకూర్చుకుంటుండటం వల్ల పాకిస్తాన్ కూడా అదే బాటలో ప్రయత్నాలు ప్రారంభించింది.

Related posts

రైస్ మిల్లు కార్మిక కుటుంబాలకు యాజమాన్యం అండగా నిలవాలి

Satyam NEWS

ఎస్సీ, ఎస్టీ కేసులపై పరిహారం త్వరగా అందజేయాలి

Sub Editor

4730మందికి లైసెన్స్ లు పంపిణి

Bhavani

Leave a Comment