29.2 C
Hyderabad
October 10, 2024 19: 06 PM
Slider ప్రత్యేకం ప్రపంచం

ఈ తెలుగు వాళ్లు ఇద్దరూ అంతర్జాతీయ ఉగ్రవాదులట

Imran-Khan-Pakistan-Prime-Minister

భారత్ సాక్ష్యాధారాలతో సహా పట్టుకుని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల కేసులు నిరూపిస్తుంటే పాకిస్తాన్ మాత్రం అలాంటివేం లేకుండా భారత్ ను ఏదో ఒక విధంగా ఉగ్రవాద కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. మరీ ముఖ్యంగా జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంలో అమెరికా, ఫ్రాన్స్ సహాయంతో భారత్ చేసిన ప్రయత్నాలు ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో నెగ్గిన నాటి నుంచి పాకిస్తాన్ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నది. అందుకే ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో ఆల్ ఖైదా కట్టడి తీర్మానం అయిన 1267 తీర్మానం కింద ప్రతి సారీ భారత్ పై ఆరోపణలు చేస్తూనే ఉంది. ఈ తీర్మానం కింద దాదాపు నలుగురు భారతీయులను పాకిస్తాన్ అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ముద్ర వేసేందుకు ప్రయత్నించగా భారత్ వారిని కాపాడుకున్నది. బెలూచిస్తాన్, పెషావర్ ప్రావిన్స్ లలో ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టారనే అభియోగాలను ఈ నలుగురిపై మోపిన పాకిస్తాన్ కేసులు కూడా నమోదు చేసింది. ఈ నలుగురిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక సాఫ్ట్ వేర్ డెవలపర్ కూడా ఉండటం గమనార్హం. ఆఫ్ఘనిస్థాన్ లోని కాబూల్ లో ఒక బ్యాంకులో పని చేస్తున్న అప్పాజీ అంగర అనే సాఫ్ట్ వేర్ డెవలపర్ ను పాకిస్తాన్ ఉగ్రవాదిగా ముద్ర వేసింది. 2017 ఫిబ్రవరి 13న లాహోర్ లోని మాల్ రోడ్డులో జరిగిన పేలుళ్లకు అప్పాజీ సూత్రధారి అని పాకిస్తాన్ బూటకపు ఆరోపణలు చేసింది. పాకిస్తాన్ లోని తహరీక్ ఏ తాలిబాన్ తో కలిసి అప్పాజీ పని చేస్తున్నాడని పాకిస్తాన్ ఆరోపించింది. ఇదే అప్పాజీ 2014 డిసెంబర్ 16న పెషావర్ లోని ఒక స్కూల్ పై జరిగిన ఉగ్రవాద దాడిలో కూడా ప్రధాన నిందితుడని పాకిస్తాన్ పేర్కొన్నది. అదే విధంగా ఒడిసా కు చెందిన గోవింద పట్నాయక్ దుగ్గివలస కూడా ఉగ్రవాదేనట. బెలూచిస్తాన్ లో పాకిస్తాన్ నాయకుడిపై జరిపిన దాడిలో దుగ్గివలస నిందితుడని పాకిస్తాన్ పేర్కొంటున్నది. ఈ దాడిలో 160 మంది కూడా మరణించారని పాకిస్తాన్ పేర్కొంటున్నది. దుగ్గివలసను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని పాకిస్తాన్ కోరుతున్నది. విశాఖ పట్నంలో ఎంబిఏ చేసిన దుగ్గివలస చెన్నైలో కంప్యూటర్ విద్యను అభ్యసించాడు. ఆఫ్ఘనిస్థాన్ పునర్ నిర్మణం ప్రాజెక్టులో పని చేసేందుకు దుగ్గివలస కాబూల్ వెళ్లాడు. అదృష్టం ఏమిటంటే భారత నిఘా విభాగం పాకిస్తాన్ కుట్రలను ముందే పసిగట్టి వీరిద్దరిని కాబూల్ నుంచి భారత్ కు రప్పించేసింది.

Related posts

కాటికి పోదామంటే దారి కరవాయే

Satyam NEWS

తొందరపడి బియ్యం అమ్ముకోవద్దు.. లాభం వస్తుంది ఆగండి

Satyam NEWS

వనపర్తిలో బ్రోకర్ యిజంగా మారిన జర్నలిజం

Satyam NEWS

Leave a Comment