36.2 C
Hyderabad
April 25, 2024 21: 53 PM
Slider ప్రపంచం

ఆర్ఎస్ఎస్ కు అంతర్జాతీయ నిధులపై పాకిస్తాన్ ఆందోళన

#PakistanLeaders

హిందూ ఉగ్రవాద సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ కు అంతర్జాతీయ సంస్థల నుంచి పెద్ద మొత్తంలో అందుతున్న విరాళాలపై ఐక్యరాజ్యసమితి, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటిఎఫ్) కఠిన చర్యలు తీసుకోవాలని కాశ్మీర్ పై పాకిస్తాన్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ షహరియార్ ఖాన్ అఫ్రీదీ డిమాండ్ చేశారు.

విదేశాల నుంచి ఆర్ఎస్ఎస్ కు భారీగా విరాళాలు అందుతున్నాయని, ఈ నిధులను ఉపయోగించి ఆర్ఎస్ఎస్ జమ్మూ కాశ్మీర్ లో ముస్లింలను అణచి వేస్తున్నదని ఆయన ఆరోపించారు. అఫ్రీదీ తో ఆజాద్ జమ్మూ కాశ్మీర్ మాజీ ప్రధానమంత్రి అతీక్ ఖాన్ నేడు పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సచివాలయంలో భేటీ అయ్యారు.

భారత్ నుంచి జరుగుతన్న ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని వారిదరూ అభిప్రాయపడ్డారు. విదేశాల నుంచి అందుతున్న విరాళాలతో ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నదని వారు ఆరోపించారు.

2006లో మాలేగావ్ పేలుళ్లు, హైదరాబాద్ లోని మక్కా మసీదు పేలుడు, సంఝౌతా ఎక్స్ ప్రెస్ పేలుడు ఈ కోవలోకి వస్తాయని వారు తెలిపారు. వివిధ దేశాలలోని భారత రాయబార కార్యాలయాలు నిధులను చట్ట విరుద్ధంగా భారత్ కు బదిలీ చేస్తున్నాయని వారు తెలిపారు.

Related posts

సడన్ ఫాల్ :మంచులో నుండి జారుతూ పాకిస్థాన్‌ భూభాగంలోకి

Satyam NEWS

గోదావరి తీర గ్రామాలకు జిల్లా కలెక్టర్ హెచ్చరిక

Satyam NEWS

కేసు దర్యాప్తు కు అడ్డుపడుతున్న రాజకీయ నాయకుల యాత్రలు

Satyam NEWS

Leave a Comment