రోజు రోజుకూ పాకిస్తాన్ ఆర్ధికంగా, రాజకీయంగా, ప్రపంచ దేశాలలో చులకన అయిపోతున్నదని అందువల్ల రాబోయే రోజుల్లో వరల్డ్ మ్యాప్ లో పాకిస్తాన్ ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేష్ కుమార్. రోజురోజుకి పాకిస్తాన్ ఆర్ధికంగా బలహీనపడుతుందని, ఇదే కొనసాగితే మరికొన్ని సంవత్సరాల్లో లాహోర్ లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను జరుపుకునే రోజు వస్తుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తికి చెందిన ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత గిల్గిత్ -బలూచిస్తాన్ ప్రాంతం, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని కార్యకర్తలు అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న దారుణాల గురించి ఐక్యరాజ్యసమితికి తెలియజేస్తున్నారన్నారు. ఆ దేశంలోని ఆర్థిక, సామాజిక, రాజకీయ, వేర్పాటువాద ఉద్యమాల కారణంగా పాకిస్తాన్ పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు.
previous post