23.7 C
Hyderabad
March 23, 2023 01: 20 AM
Slider ప్రపంచం ముఖ్యంశాలు

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం

Imrankhan

జమ్ముకశ్మీర్ విభజన బిల్లు కు భారత్ పార్లమెంటు ఉభయసభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన జాతీయ భద్రత కమిటీ సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. జమ్ముకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దులపై చర్చించారు. జమ్ముకశ్మీర్ పై భారత్ నిర్ణయాన్ని సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్ వ్యవహారాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లాలని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. ఇకపై భారత్ తో ఉన్న వాణిజ్య సంబంధాలు రద్దు చేయాలని ఆదేశించారు. అలాగే భారత్ తో ఉన్న దౌత్య సంబంధాలు సైతం తగ్గించుకోవాలని సూచించారు. భారత్ తో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలను మరోసారి పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. 

Related posts

కూలీలకు, చేతి వృత్తిదారులకు నెలకు పది వేలు ఇవ్వాలి

Satyam NEWS

పోలీసు శాఖలో పదోన్నతులతో పాటు బాధ్యతలు పెరుగుతాయి

Satyam NEWS

ఆ టూరిస్టులపై పరారీ కేసులు

Murali Krishna

Leave a Comment

error: Content is protected !!