భారత్ పాక్ మధ్య యుద్ధం సంభవిస్తే దానికి ప్రపంచదేశాలే బాధ్యత వహించాలని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. జమ్మూ కాశ్మీర్ పై భారత్ తీసుకున్న చర్య పై అంతర్జాతీయ వేదికలపై చర్చిస్తామని ఆయన అన్నారు. కాశ్మీర్ ప్రజల గొంతును వీలైన అన్ని చోట్లా వినిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆయన కాశ్మీర్ కు సంఘీభావంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ముజఫరాబాద్ లో జరుపుకున్నారు. ముజఫరాబాద్ శాసనసభలో ఆయన కాశ్మీర్ పై భారత్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేయడం ఒక చారిత్రక తప్పిదమని ఆయన అన్నారు.
previous post
next post