తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన కొద్ది నెలల్లోనే రైతులకు రెండులక్షల రుణమాఫీలో భాగంగా మొదటి విడత లక్ష రూపాయల రుణమాఫీ విడుదల కార్యక్రమంలో భాగంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన రైతు రుణమాఫీ సంబరాల్లో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా రైతు వేదికలో ఏర్పాటు చేసిన ముఖ్య మంత్రి వీడియో స్కీయింగ్ సమావేశంలో ఆయన రైతులతో కలిసి పాల్గొన్నారు.అనంతరం సిఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి మొక్కను నాటి నీరు పోశారు.కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్సీ దండే విఠల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలుకుతూ టపాసులు కాల్చి సాధర స్వాగతం పలికారు._
బెజ్జురు మండల కేంద్రంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్సీ దండే విఠల్ గారు భూమి పూజ చేసారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు అర్షధ్ హుస్సేన్ నివాసంలో పలువురు ఇతర పార్టీలకు చెందిన నాయకులు ఎమ్మెల్సీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చెరికయ్యారు.ఇట్టి కార్యక్రమంలో బేజ్జూర్ మండల ప్రజా ప్రతినిధుల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు ఉన్నారు._