34.2 C
Hyderabad
April 19, 2024 22: 45 PM
Slider మహబూబ్ నగర్

పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పరిశీలన

#Sharman IAS

శరవేగంగా సాగుతున్న పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను సోమవారం జిల్లా కలెక్టర్ శర్మన్ క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రాజెక్టు పనులను పరిశీలించారు. మొదట ఎల్లూరు రిజర్వాయర్‌ పనులను పరిశీలించారు. 0 పాయింట్‌ వద్ద పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నమూనాను జిల్లా కలెక్టర్ కు ఇంజనీర్లు వివరించారు. అనంతరం ఆయన  రిజర్వాయర్‌ బ్యాక్‌ వాటర్‌ పంపుహౌజ్,  జలాశయం పనులు, ఏదుల జలాశయం పనులను సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలసి కలెక్టర్ శర్మన్ పరిశీలించారు.

ఈ సందర్భంగా అధికారులు మ్యాప్ ద్వారా ప్రాజెక్టు జరుగుతున్న పనులపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ప్రాజెక్టు అధికారులు మాట్లాడుతూ ఆసియాలోనే పాలమూరు రికార్డు సృష్టించనుందని, 41 అధునాతన పంపులతో దీన్ని చేపట్టామన్నారు.  ప్రాజెక్టు టన్నెల్‌ పనులను కలెక్టర్ కు ఇంజనీరింగ్ అధికారులు  చూపించారు. 

కిలోమీటర్ల మేర టన్నెల్‌లో ప్రయాణించి సొరంగం నిర్మాణం, ప్రాజెక్టు ప్రగతిపై కలెక్టర్ వారితో చర్చించారు.  కలెక్టర్ వెంట ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారి విజయ భాస్కర్ రెడ్డి ఇతర ఇంజనీరింగ్ అధికారులు తదితరులు ఉన్నారు.

Related posts

ఫ్యామిలీ డాక్టర్ పథకం ఆరోగ్యశ్రీకి రెండో దశ

Bhavani

స్థిరవేతనదారుల ఉసురు తీస్తున్న కరోనా లాక్ డౌన్

Satyam NEWS

దొంగలు బాబోయ్ దొంగలు

Satyam NEWS

Leave a Comment