33.2 C
Hyderabad
April 26, 2024 01: 37 AM
Slider గుంటూరు

16 నుంచి పల్నాటి జిల్లా ఉత్సవాలు ప్రారంభం

#gopireddysrinivasareddy

ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న  ఒంగోలు జాతి వృషభ రాజుల బల ప్రదర్శన పోటీలకు భూమిపూజ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని స్టేడియంలో నిర్వహించారు. శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొబ్బరి కాయ కొట్టి ఈ కార్యక్రమానికి తొలిపుజా చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 16 నుంచి 23 వరకు  ఒంగోలు జాతి వృషభ రాజుల బల ప్రదర్శన పోటీలతో పాటు, పల్నాటి సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా కర్రసాము, కోడిపందాలు, పొట్టేళ్ల పోటీలు, ఆవుల అందాల పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కరోనా వల్ల ఈ పోటీలు కొంచం ఆలస్యంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పలనాడు జిల్లాగా ఏర్పాటు ఐన తరుణంలో సీఎం కి కృతజ్ఞతలు తెలపడంతో పాటు పల్నాడు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టినట్లు వివరించారు. గతేడాది 160 ఎడ్ల జత పందెంలో పాల్గొన్నాయి అని.. ఈ సారి ఆ సంఖ్య 200 చేరుతుంది అని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోరబోయిన శ్రీనివాస రావు, జెడ్పీటీసీ చిట్టిబాబు, లక్కు కృష్ణరెడ్డి, మురే రవీంద్రా రెడ్డి, కనకా పుల్లారెడ్డి, వంపుగుది జాన్, ఆకుల సత్యం, నడికట్టు శ్రీకాంత్, తోట వీరయ్య, మఠం సునీల్ వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

Related posts

New Wave: గురజాడ “ప్రకాశిక” మళ్ళీ వెలుగులోకి

Satyam NEWS

ఫిస్టుఫుల్ ఆఫర్: మేడారం భక్తులకు ప్రసాదంగా బంగారం

Satyam NEWS

చంద్రబాబుతో తెలంగాణ తెలుగుదేశం నేతల భేటీ

Satyam NEWS

Leave a Comment