బిచ్కుంద మండలంలో పల్స్ పోలియో లో భాగంగా 96శాతం మందికి చుక్కల మందు వేసినట్లు ఆరోగ్య బోధకులు దస్థిరం తెలిపారు. ఈ పల్స్ పోలియో కార్యక్రమం పండుగలా ప్రారంభమైంది. మండల కేంద్రంలో ఎంపిపి అశోక్ పటేల్ పల్స్ పోలియోను ప్రారంభించగా పుల్కల్ గ్రామంలో వైస్ఎంపిపి రాజు పటేల్ ప్రారంభించారు.
బండరెంజల్ లో సర్పంచ్ గడ్డం బాల్రాజ్, గుండె కల్లూరులో సర్పంచ్ సంగీత, రాజులలో సర్పంచ్ చంద్రభాగ, చిన్న దడిగిలో సర్పంచ్ అనిత విఠల్ రెడ్డి, వాజిద్ నగర్ లో సర్పంచ్ అనుయ, ఖత్ గామంలో సర్పంచ్ జీవన్, మిషన్ కళ్లాలిలో ఎంపిడిఓ ఆనంద్ తో పాటు ఆయా గ్రామాలలో సర్పంచులు చిన్నారులకు చుక్కల మందు వేసి పల్స్ పోలియోను ప్రారంభించారు.