18.3 C
Hyderabad
December 6, 2022 06: 26 AM
Slider సినిమా

పాన్ వరల్డ్ మూవీ “కమ్యూనిస్ట్ గర్ల్ ఫ్రెండ్ క్యాపిటలిస్ట్ బోయ్ ఫ్రెండ్”

#naveenmullangi

“మనం సినిమాలు తెలుగులోనే ఎందుకు తీయాలి? ఇంగ్లీషులో తీసి వందల కోట్లు సంపాదించకూడదు?”

“మన తెలుగు సినిమాలు వంద కోట్లు సంపాదిస్తేనే ఎగిరి గంతేస్తున్నాం. కానీ.. ఇంగ్లీష్ సినిమాలు వేల, లక్షల కోట్లు గడిస్తుండడం నుంచి మనం స్ఫూర్తి పొందలేకపోతున్నాం” అంటున్నాడు తెలంగాణ చిచ్చరపిడుగు నవీన్ ముళ్లంగి. బిజినెస్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ చేసి, ఓ మల్టీ నేషనల్ కంపెనీలో జాబ్ చేస్తున్న ఈ పాతికేళ్ల ఖమ్మం కుర్రాడు… తనే “హీరో కమ్ రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్”గా ఇంగ్లీషులో ఓ ఫీచర్ ఫిల్మ్ చేసి ట్రెండ్ సెట్ చేసేందుకు సమాయత్తమవుతున్నాడు.

పరస్పర విరుద్ధమైన భావజాలం కలిగిన ఓ అబ్బాయి – అమ్మాయి నడుమ నడిచే యునీక్ లవ్ స్టోరీగా “కమ్యూనిస్ట్ గర్ల్ ఫ్రెండ్ – క్యాపిటలిస్ట్ బోయ్ ఫ్రెండ్” పేరుతో నవీన్ ముళ్ళంగి తీసిన ఈ చిత్రం షూటింగ్ తోపాటు… పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం పూర్తి చేసుకుంది. గంటన్నర నిడివి గల ఈ చిత్రం ట్రైలర్ త్వరలో విడుదల కానుంది.

ఓ సినిమా రూపకల్పనకు అవసరమైన పలు సాంకేతిక అంశాల్లోనూ సుశిక్షితుడిగా తనను తాను తీర్చిదిద్దుకున్న నవీన్… ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కలిగిన ఇంగ్లీషులో సినిమాలు తీసి… తన సత్తా చాటుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. “వాటర్ ఎంటర్టైన్మెంట్స్” పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహిస్తూ… గత కొన్నేళ్లుగా మంచి సంపాదన మరిగిన నవీన్ ముళ్ళంగి… అదే పేరుతో బ్యానర్ స్టార్ట్ చేసి… రూపొందించిన “కమ్యూనిస్ట్ గర్ల్ ఫ్రెండ్ – క్యాపిటలిస్ట్ బోయ్ ఫ్రెండ్” చిత్రంలో నవీన్ సరసన ‘శివ ప్రీతిక సుక్క’ అనే చక్కని చుక్క హీరోయిన్ గా నటించింది. ఇలియాజ్ సినిమాటోగ్రఫీ అందించారు!!

Related posts

సీఎం జగన్ కి విద్యా వ్యవస్థపై సరైన అవగాహన లేదు

Satyam NEWS

అన్ని శాఖలూ సమాచారంతో రెడీగా ఉండాలి

Satyam NEWS

తెలంగాణ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని 5వ విడత పాదయాత్ర

Bhavani

Leave a Comment

error: Content is protected !!