16 వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగరియా రాష్ట్ర పర్యటనకు వచ్చారు. అరవింద్ పనగారియాకు ఫైనాన్స్ కమిషన్ సభ్యులకు గన్నవరం ఎయిర్ పోర్టు లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఘనంగా స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఆర్థిక 16 ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులు విజయవాడలోని నోవాటెల్ హోటల్ కు చేరుకున్నారు. రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు ఫైనాన్స్ కమిషన్ బృందం పర్యటించనున్నది. నాలుగు రోజుల పర్యటనలో విజయవాడ, తిరుపతి నగరాల్లో పనగారియా బృందం పర్యటించనున్నది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన సాయం వంటి కీలకమైన అంశాలపై సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల ఫైనాన్స్ కమిషన్ టీంతో భేటీ కానున్నారు.
previous post
next post