32.2 C
Hyderabad
April 20, 2024 20: 10 PM
Slider నిజామాబాద్

పంచాయితీ కార్మికులు పెండింగ్ వేతనాలు చెల్లించాలి

గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించి వారందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ మంగళవారం సి ఐ టి యు జిల్లా నాయకుడు సురేష్ గొండ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఎంపి డివో ఆనంద్, ఎంపి ఓ మహిబూబ్ లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా సురేష్ గొండ మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రధానంగా బకాయి పడ్డ వేతనాలు ఇవ్వాలని, కనీస వేతనం 26వేలు ఇస్తూ ప్రతి కార్మికుడికి యూనిఫామ్, పి ఎఫ్, ఈ ఎస్ ఐ, సౌకర్యం కల్పించి ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

గ్రామపంచాయతీ లో పని చేస్తున్న ప్రతి కార్మికులందరికి గుర్తింపు కార్డులు ఇచ్చి డ్రైవర్లు గా పని చేస్తున్న వారికీ ప్రభుత్వం ద్వారా లైసెన్స్ ఇప్పించాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చెయ్యాలని కోరారు. కార్యక్రమం లో తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ బిచ్కుంద మండల అధ్యక్షుడు బి. సాయిలు, ఉపాధ్యక్షుడు సి హెచ్. సాయిలు, మండల నాయకులు సుశీల, చంద్రవ్వ, ప్రేమల, సురేందర్, బాజిరం తదితరులు పాల్గొన్నారు.
జీ లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం

Related posts

రాష్ట్ర స్థాయిలో విజేతలైన నిర్మల్ జిల్లా దివ్యాంగులకు సన్మానం

Satyam NEWS

“అందరి గెలుపునకు ఎంపీ ఆదాల రొట్టె”

Bhavani

పి డి ఎస్ యు రాష్ట్ర కమిటీలో మఠంపల్లి మండల కొత్త తండ వాసి

Satyam NEWS

Leave a Comment