గ్రామాల్లో మళ్లీ ఎన్నికల సందడి వస్తున్నది. సంక్రాంతికి ముందే స్థానిక ఎన్నికల నగారా మోగనుంది. కొత్త సంవత్సర ప్రారంభం నుంచే హడావిడి నెలకొనబోతోంది. డిసెంబరు 15నాటికి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. జనవరి 10న పంచాయతీల రిజర్వేషన్లు ఫైనల్‌చేస్తే మరుసటి రోజునుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది.
గుంటూరు జిల్లాకు సంబంధించి గుంటూరు డివిజన్ లో 33 మేజర్ – 274 మైనర్, తెనాలి డివిజన్ లో 67 మేజర్ – 282 మైనర్, నరసరావుపేట డివిజన్ లో 12 మేజర్ – 363 మైనర్ పంచాయితీలు ఉన్నాయి. డిసెంబరు 15కు బ్యాలెట్ పేపర్లు సిద్ధం అవుతాయి. జనవరి 10న రిజర్వేషన్ల జాబితా ఖరారు అవుతుంది. ఆ మరుసటి రోజు నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది.