28.7 C
Hyderabad
April 20, 2024 07: 30 AM
Slider జాతీయం

Corona 2nd wave: మళ్లీ లాక్ డౌన్ దిశగా రాష్ట్రాల నిర్ణయాలు

#PanjabGovenment

దేశంలో విచ్చలవిడిగా మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కచ్చితమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరడంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి.

పంజాబ్ లో ఇబ్బడిముబ్బడిగా కరోనా కేసులు పెరుగుతున్నందున ఆ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నది.

ఈ నెల 31 వరకూ విద్యా సంస్థలను పంజాబ్ ప్రభుత్వం మూసివేసింది. కరోనా కట్టడి కోసం రెండు వారాల పాటు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం కోరింది.

అదే విధంగా సినిమా హాళ్లలో 50 శాతం సీట్లను మాత్రమే భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. షాపింగ్ మాల్స్ లో 100 మంది కన్నా ఎక్కువ మందికి అనుమతి లేదు.

వివాహాలు, అంత్యక్రియలు లాంటి కార్యక్రమాలకు కేవలం 20 మందిని మాత్రమే అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు.

కరోనా తీవ్రత ఎక్కువ గా ఉన్న 11 జిల్లాలలో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే విధమైన ఆంక్షలు విధించింది.

Related posts

అనధికార నిర్మాణాలను ఉపేక్షింది లేదు..

Satyam NEWS

దళిత కాలనీలో MLA ఆకస్మిక పర్యటన

Satyam NEWS

లాక్ డౌన్ రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు

Satyam NEWS

Leave a Comment