27.7 C
Hyderabad
April 24, 2024 08: 55 AM
Slider మహబూబ్ నగర్

తల్లిదండ్రులు ఓకే అంటేనే పిల్లలు పాఠశాలలకు….

#NagarkurnoolCollector

ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్న పాఠశాలలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఎల్ శర్మన్ స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ఎల్. శర్మన్ అడిషనల్ కలెక్టర్ చౌదరితో పాటు మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా  ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా అంతం చేస్తూ ఇప్పుడిప్పుడే కోరుకుంటున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఫిబ్రవరి ఒకటి నుండి 9 ఆ పై తరగతులకు విద్యను అందించాలన్న ఆదేశాలు వచ్చిందని పేర్కొన్నారు.

అందుకు తగినట్టుగా ఈనెల 25 లోపు అన్ని పాఠశాలలు కళాశాలలు గురుకులాల్లో విద్యార్థులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

ఒక్కో బెంచికి ఒక విద్యార్థి

కరోనా పూర్తిస్థాయిలో అంతమయ్యే దాకా కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరముందని ప్రభుత్వం ఇచ్చిన సూచన మేరకు తరగతి గదిలో ఒక్కో బెంచికి ఒక విద్యార్థిని మాత్రమే కూర్చోబెట్టాలని ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

గదిలో 20 మంది విద్యార్థులకు మించి కూర్చోబెట్ట రాదని స్పష్టంగా విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.

పాఠశాలకు వచ్చిన విద్యార్థులు గుంపులు గుంపులుగా కూర్చోకుండా వారికి కోవిడ్ నిబంధనలపై సూచనలు సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల దేనన్నారు. లక్షణాలు ఉన్న విద్యార్థులకు వారిపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

తప్పనిసరిగా శానిటేషన్ చేసుకుంటూ మాస్కూలు ధరించాలని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన బియ్యం 2 రోజుల ముందు గోదావరి నుండి తప్పించుకోవాలని పాత బియ్యాన్ని పక్కన పెట్టాలన్నారు.

వాటికి వినియోగించిన పాత వంట సామాగ్రి సైతం ప్రస్తుతం ఏ ఒక్కటి వినియోగించరాదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.

మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులను దూరంగా కూర్చోబెట్టాలని వాటి పర్యవేక్షణ బాధ్యతలను ప్రధానోపాధ్యాయులు పాఠశాల ఉపాధ్యాయులకు అప్పజెప్పినట్లు తెలిపారు.

నాగర్ కర్నూలు జిల్లాలో అన్ని పాఠశాలలకు సంబంధించిన 23 వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది విద్యార్థుల కు కావలసిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించామన్నారు.

అన్ని ప్రైవేట్ పాఠశాలలు సైతం ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే నడుచుకోవాలి అన్నారు.

అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా ను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

భావితరాలకు మంచి ఆరోగ్యం వాతావరణం అందించాలంటే ప్రస్తుతం ప్లాస్టిక్ మహమ్మారిని నిర్వహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేస్తూ ఇకనుండి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

అందుకోసం చెత్త బయట ప్రారంభిస్తే నూతన చట్టం ప్రకారం రూ 500 జరిమానా విధించడం జరుగుతుందని ఈ చట్టంలో ఎవరు అతిథులు తడి పొడి చెత్తను వేరు చేసి ఇంటి వద్దకు వచ్చే చెత్త బండి వారికి ఇవ్వాలని అలా చేయని వారి చెత్త తీసుకోకూడదని స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు

ఇది మార్చి మొదటి నుండి అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం ప్రతి ఒక్కరు అందుకు అనుగుణంగానే నడుచుకోవాలి అన్నారు.

ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తమ ఇంటి నుంచి మార్పును ప్రారంభించాలని అన్నారు.

ఈ సమావేశంలో  డీఈవో గోవిందరాజులు, సెక్టోరల్ అధికారులు కుర్మయ్య మంతటి నారాయణ పాల్గొన్నారు.

Related posts

అనుమానంతో భార్య ను హత్య చేసిన వ్యక్తి

Bhavani

జగనన్న ఇళ్ల నిర్మాణ ఖర్చు మూడున్నర లక్షలకు పెంచాలి

Satyam NEWS

ధ‌ర‌లు దిగిరావాలి…జ‌గ‌న్ దిగిపోవాలి…అంటూ టీడీపీ ధ‌ర్నా…!

Satyam NEWS

Leave a Comment