38.2 C
Hyderabad
April 25, 2024 14: 08 PM
Slider రంగారెడ్డి

తల్లిదండ్రుల గురువుల ఆశయాన్ని నిలబెట్టే బాధ్యత మీదే

#talakondapally

తల్లిదండ్రులను సంతోషపరిచి  గురువుల ఆశయాన్ని నిలబెట్టే బాధ్యత విద్యార్థులదేనని తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ పేర్కొన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెల్జాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  విద్యను అభ్యసిస్తున్న  దాదాపు 420 మంది విద్యార్థులకుఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ క్రీడా దుస్తులను ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రేలారే రేలా జానపద గాయని గంగ హాజరయ్యారు. ఈసందర్భంగా ఉప్పల వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులకు వారి ఉన్నత చదువులకు చేదోడు వాదోడుగా పేద విద్యార్థులు విద్యకు దూరం కాకూడదని తన వంతు సహాయం అందించడం నా పూర్వజన్మ సుకృతం అని, మీకు సేవ చేయడం దేవుడు ఇచ్చిన వరం అని తెలిపారు.విద్యా రాణి వాడు వింత పశువు అని సామెత గుర్తుకు చేశారు. విద్యతోటే జీవితమని కష్టపడి చదివి తల్లిదండ్రులకు గురువులకు గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తేవాలని సూచించారు.

దేశంలో ఒకరిగా జీవించకుండా దేశ చరిత్రలో పేరు నిలబడేలా పాలకులుగా, ఆఫీసర్లుగా ఉన్నత స్థాయికి ఎదగాలని, అదేవిధంగా సమాజాన్ని సక్రమమైన మార్గంలో చక్కదిద్దే బాధ్యత రానున్న రోజుల్లో మీదైన శైలిలో తీర్చిదిద్దాలన్నారు.అబ్దుల్ కలాం భారతదేశ అత్యున్నత మొదటి పౌరుడిగా ఎన్నికవుతారని ఎవరు ఊహించలేదని,అవుల్ పకీర్ జైనులబ్దీన్ కలామ్ తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో ఒక తమిళ ముస్లిం కుటుంబంలో 1931, అక్టోబరు 15 న జన్మించిన ఆయన తండ్రి జైనులబ్దీన్, పడవ యజమాని. తల్లి ఆషియమ్మ గృహిణి. పేద కుటుంబం కావటంతో కుటుంబ అవసరాల కోసం కలామ్ చిన్న వయసులోనే పని చేయడం ప్రారంభించారని పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, తన తండ్రికి ఆర్థికంగా చేదోడువాదోడుగా ఉండటానికి వార్తా పత్రికలు పంపిణీ చేశారని తెలిపారు.

ఎంతో కృషితోభారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారని భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నారని కొనియాడారు.మీరు కూడా అంతటి స్థాయిలో ఉండాలని  విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి సర్పంచులు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అయోధ్య రామాలయానికి అమరావతి మట్టి నీళ్లు

Satyam NEWS

నా భర్త నాతో కాపురం చేయడం లేదు సార్

Satyam NEWS

మరో రెండు రోజుల్లో తొలి కరోనా వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌

Satyam NEWS

Leave a Comment