28.7 C
Hyderabad
April 20, 2024 05: 09 AM
Slider ముఖ్యంశాలు

పార్లమెంట్ ను రాష్ట్రపతి ప్రారంభించాలి

#RAHUL

కొత్త పార్లమెంట్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రపతి ఉన్నాక ప్రధాని మోడీ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సిన అవసరం లేదని అన్నారు. మోడీ ఏది చేసిన రాజకీయ లబ్ది కోసమే చేస్తారని విమర్శించారు. కాగా మే 18న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రదాని మోడీని కలిసి నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలని ఆహ్వానం అందజేశారు.

అందుకు మోడీ అంగీకరించగా.. ఈ నెల 28న మోడీ కొత్త పార్లమెంట్ ను ప్రారంభించనున్నారు. కాగా మే 28 వీడీ సావర్కర్ జయంతి అని.. కావాలనే మోడీ ఆ రోజును పార్లమెంట్ భవనాన్ని ప్రారంభిస్తున్నారని కొంతమంది విపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.

దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గాంధీ, నెహ్రూ, పటేల్ వంటి నాయకులకు ఇది అవమానకరం అని అన్నారు. కాగా 2020 డిసెంబర్ 10న కొత్త పార్లమెంట్ భవన నిర్మానానికి పీఎం మోడీ శంకుస్థాపన చేశారు. మొత్తం 1,280 మంది సభ్యులు కూర్చునే విధంగా ఈ పార్లమెంట్ ను నిర్మించారు. ఇందులో లోక్ సభలో 888 మంది, రాజ్య సభలో 300 మంది కూర్చునే విధంగా నిర్మించారు.

Related posts

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో డాక్టర్ రవీందర్ జన్మదినం

Satyam NEWS

తిరుమల తిరుపతి దేవస్థానం వారు కళ్యాణమస్తు నిలిపివేశారా?

Satyam NEWS

రాహుల్ మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండు

Satyam NEWS

Leave a Comment