40.2 C
Hyderabad
April 19, 2024 17: 34 PM
Slider ఆదిలాబాద్

పార్ట్ టైం టీచర్లను సీఆర్ టిలుగా రెగ్యులరైజ్ చేయాలి

#adilabad

ఏజెన్సీ ప్రాంతాల్లోని ఐటిడిఎ పరిధిలోని పాఠశాలలో పార్ట్ టైం టీచర్స్ గా పనిచేసిన వారిని CRT లుగా రెగ్యులరెజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ నిరుద్యోగులు తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావ్ ఆద్వర్యంలో  ఉట్నూర్ ఐటిడిఎ కార్యలయంలో ప్రాజెక్ట్ అధికారి భవేష్ మిశ్రాను కలిసి వినతి పత్రాన్ని అందచేశారు.

ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వకుండా మారుమూల ప్రాంతాలలో  పాఠశాలలో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు నష్టపోతారని ఐ టి డి ఎ అధికారులు బిఇడి, డీఎడ్ పూర్తి చేసిన నిరుద్యోగులతో పార్ట్ టైం టీచర్లను నియమించారని వారు తెలిపారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఆశ్రమ ఉన్న పాఠశాలలో మారుమూల గూడాలలో ఉన్న పాఠశాలలో పార్ట్ టైం టీచర్లుగా గత మూడు సంవత్సరాలుగా వివిధ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తూ పార్ట్ టైం టీచర్లను పి టి లకు నియమించి కొనసాగిస్తున్నారని వారు తెలిపారు.

అయితే covid-19 కారణంగా పార్ట్ టైం టీచర్లుగా పనిచేస్తున్న నిరుద్యోగులు గ్రామాలలో ఉంటూ వాళ్ళ ఆర్థిక పరిస్థితి, కుటుంబ పోషణ కష్టంగా మారిందని తెలిపారు. తమను సిఆర్టి(CRT) లుగా మార్చి ఆదుకోవాలని ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కి వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆదివాసి పార్ట్ టైం టీచర్ సంఘం KB అధ్యక్షులు కుమ్ర జ్యోతి రామ్ ఉపాధ్యక్షులు మెస్రం శ్రీకాంత్ అర్చన జ్ఞానేశ్వర్ శంకర్ శివాజీ ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కోట్నాక్ గణపతి ఆదివాసీ నాయకులు గేడం నిరంజన్ ఆదివాసీ నిరుద్యోగులు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

T20: రెండో విజయాన్ని అందుకున్న టీమిండియా

Satyam NEWS

రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలకు రక్షణ కరువైంది

Satyam NEWS

సిఎం జగన్ ను అమిత్ షా ఎందుకు కలవలేదో తెలుసా?

Satyam NEWS

Leave a Comment