38.2 C
Hyderabad
April 25, 2024 13: 50 PM
Slider శ్రీకాకుళం

మార్చి26న జరిగే భారత్ బంద్ జయప్రదం చేయండి

#CPISrikakulam

రైతు వ్యతిరేక చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి, విశాఖ ఉక్కు పరిరక్షణ పొరాట వేదిక ఇచ్చిన మార్చి 26 వ తేదీ భారత్ బంద్ కు శ్రీకాకుళం జిల్లా వామపక్షాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఈ బంద్ ను అన్ని వర్గాలు జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేసాయి.

రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేసి గిట్టుబాటు ధరను గ్యారెంటీ చేయాలని ,విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను రద్దు చేసి ప్రైవేటై జేషన్, కార్పోరేటీకరణను ఆపాలని ఈబంద్ పిలుపు నిస్తున్నది. ఈ సమస్యలు ఆయా వర్గాలకే కాకుండా దేశ ప్రజానికానికంతా నష్ట దాయకమని తెలిపారు.

కేంద్రం ప్రభుత్వం కంపెనీలకు దాసొహమంటూ ప్రజలను రొడ్ఢు పాలు చేసి,రాజ్యాంగం కల్పించిన హక్కులను సైతం కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని ప్రకటించారు .కాబట్టి జిల్లా పజానీకమంతా ఈబంద్ లొ స్వఛ్చందంగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

దీనిలో  తాండ్ర అరుణ  సి పి ఐ(యం ఎల్) జిల్లా కార్యదర్శి. సనపల నరసింహులు సి పి ఐ,జిల్లా కార్యదర్శి. తాండ్ర ప్రకాష్ సి పి ఐ యం ఎల్ న్యూడెమోక్రసీ, జిల్లా కార్యదర్శి. భవిరి క్రిష్ణమూర్తి సి పి యం, జిల్లా కార్యదర్శి పాల్గొన్నారు.

Related posts

అన్‌స్టాపబుల్‌ చిత్ర యూనిట్ విడుదల చేసిన ”దేశ్ కి నేత” సాంగ్

Satyam NEWS

ప్లాస్టిక్ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత: మున్సిపల్ కమిషనర్ రాజయ్య

Satyam NEWS

స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Satyam NEWS

Leave a Comment