35.2 C
Hyderabad
April 24, 2024 11: 29 AM
Slider నల్గొండ

సి.పి.యం ఆన్ లైన్ బహిరంగ సభను విజయవంతం చేయాలి

#CPMHurnagar

బానిస బతుకులు, వెట్టిచాకిరి విముక్తి కోసం 1917 అక్టోబర్ లో రష్యాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రపంచంలో మార్పుకి పునాది పడిందని,  1920 భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన తర్వాత విప్లవాత్మక మార్పు వచ్చిందని సి ఐ టి యు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని సి.పి.యం పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సి ఐ టి యు పట్టణ కమిటీ సమావేశంలో పాల్గొన్న రోషపతి మాట్లాడుతూ అనేక రాజుల ప్రభుత్వాలు నిరంతరం ప్రజల శ్రమను దోచుకునే వారని, 1957లో కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచంలోని మొదటిసారిగా ఓటు ద్వారా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు.

పని గంటలు, వేతన హక్కులు కమ్యూనిస్టు పార్టీ ద్వారానే వస్తుందని అన్నారు. 1920 నుండి 2020 వరకు వంద సంవత్సరాల చరిత్ర సి.పి.యం పార్టీ ఆధ్వర్యంలో ఆన్ లైన్ లో 17వ, తేదీ శనివారం జరుగనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.

ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా సి.పి.యం పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఈ సభలో పాల్గొని మాట్లాడతారని అన్నారు.

దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరళీకరణ, ప్రైవేటీకరణ ప్రభుత్వంగా, మతతత్వ విధానాలు అమలు చేస్తుందని దీనికి వ్యతిరేకంగా గతంలో కంటే ఎక్కువ పోరాటాలు చేయాలని కోరారు.

రాష్ట్రంలో కేటీఆర్  మున్సిపల్ శాఖ మంత్రి అయిన తర్వాత హైదరాబాద్ ని విశ్వనగరం గా చేస్తానని వరదల నగరంగా మార్చాడని అన్నారు. తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి లోతట్టు ప్రాంత ప్రజలను కాపాడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎలక సోమయ్య గౌడ్ ,ఎడ్ల కృష్ణ, నాగరాజ్, రామ్, గోపి, దుర్గారావు, వెంకన్న, అజ్జు, సుజాత, కోటమ్మ, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనా కాటుకు బలిఅవుతున్న అడ్వకేట్లకు బార్ సాయం

Satyam NEWS

తెలంగాణ రిజర్వేషన్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సారంగపాణి

Satyam NEWS

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో కొత్త చరిత్ర

Satyam NEWS

Leave a Comment