క్షేత్ర స్థాయి లో పని పని చేసిన నాయకులకే గుర్తింపు ఉంటుందని హైదరాబాద్ కాంగ్రెస్ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బలమైన నాయకులకే టికెట్స్ ఇస్తాం. డివిజన్ లలో ప్రజల మధ్య ఉండి వారితో మేమకమైన నాయకులకు టికెట్స్ లభిస్తాయి అని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ లో కుల సంఘాల కార్యకర్తలతో సన్నిహితంగా ఉండాలి. హైదరాబాద్ లో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలంటే సరైన నాయకులను సిఫార్సుసు చేయాలి. కాంగ్రెస్ పార్టీ వచ్చే గ్రేటర్ ఎన్నికల నాటికి బలంగా అవ్వాలి. అప్పుడే మనం గ్రేటర్ ఎన్నికలలో నెగ్గుతాము. గ్రేటర్ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. గ్రేటర్ ను కైవసం చేస్కోవడం మనకు చాలా ముఖ్యం అని ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకులకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజాల్లోకి విస్తృతంగా తీస్కెళ్లాలి. కాంగ్రెస్ ప్రజల కోసం చేపట్టిన పథకాలను ప్రజలకు అందే విధంగా చూడాలి. పార్టీ బలోపేతం పైనే అందరూ దృష్టి సారించాలి అని మంత్రి పిలుపునిచ్చారు.
previous post