39.2 C
Hyderabad
March 28, 2024 15: 47 PM
Slider నిజామాబాద్

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది కార్యకర్తలే

#trsjukkal

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల తెరాస అధ్యక్షులు వెంకట్రావు దేశాయ్ అన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలో తెరాస కార్యకర్తల సమావేశం శుక్రవారం జరిగింది.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు లేనిదే పార్టీ లేదని పార్టీకి కార్యకర్తలే పునాదిరాళ్ల అన్నారు. కార్యకర్తలకు అన్నివిధాలుగా అండదండలుగా నాయకులు ఉండాలన్నారు. కార్యకర్తలకు ఎప్పుడు ఏ ఆపదలో ఉన్న  వారికి అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.

కార్యక్రమానికి ముందుగా ఆదివాసీల నాయకుడు కుమురం భీం వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఈ కార్యక్రమం  ప్రారంభించారు. ఇటీవల కాలంలో అకాల మరణం చెందిన ప్రజాప్రతినిధుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

కార్యక్రమంలో తెరాస అధ్యక్షులతో పాటు వైస్ ఎంపీపీ రాజు పటేల్, మార్కెట్ కమిటి అధ్యక్షులు మల్లికార్జున్, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు సీనియర్ నాయకులు రాజు, తెరాస ప్రధాన కార్యదర్శి రాంచందర్,   రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బసవరాజుపటేల్, మండల యూత్ అధ్యక్షులు గణేష్ గొoడా, పట్టణ అధ్యక్షులు అవర్  శ్రీనివాస్, రామాలయ కమిటీ చైర్మన్ హజి బాల్రాజ్,  ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసిలు, ఇటీవలే నియమితులైన ఆయా శాఖల అధ్యక్షులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

జీ లాలయ్య, సత్యం న్యూస్ న్యూస్ రిపోర్టర్, జుక్కల్

Related posts

రోడ్ల అభివృద్ధి ఎక్కడ అంటూ వినూత్న రీతిలో జనసైనికులు నిరసన

Satyam NEWS

పైడితల్లి అమ్మ‌వారిని దృష్టిలో ఉంచుకునేనైనా రోడ్లు బాగు చేయించండి…!

Satyam NEWS

12వ స్టోర్‌ను ప్రారంభించిన సీఎంఆర్‌ లెగసీ ఆఫ్‌ జ్యువెలరీ

Satyam NEWS

Leave a Comment