సాయిబాబా జన్మస్థల విషయంలో ఇప్పట్లో వివాదాలు సమసిపోయేలా కనబడటం లేదు.కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం లా తయారయింది సాయిబాబా జన్మభూమి, కర్మ భూమి అని చెబుతున్న పత్రి, షిర్డీ గ్రామాల మధ్య వివాదం.ముందుగా ప్రకటించినట్లు కాకుండామహారాష్ట్ర సిఎం ఉద్దవ్ ఠాక్రే పత్రి విషయంలో తన వ్యాఖ్యల ఉపసంహరించు కోవడాన్ని సవాలు చేస్తూ సాయి జన్మభూమి పత్రి సంస్థాన్ బాంబే హైకోర్టులో పిటిషన్ వెయ్యాలని ఇవాళ నిర్ణయించింది.
అయితే సాయిబాబా జన్మస్థలం పత్రి అని ఉద్దవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై షిరిడిలో నిరసనలు జరగడంతో, ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. అలాగే పత్రి అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.దీనితో సద్దుమణిగిందనుకున్న సమస్య తిరగదోడినట్లయింది.