39.2 C
Hyderabad
April 23, 2024 15: 57 PM
Slider ఖమ్మం

సివిక్ సెన్స్: మన పట్టణాలను మనమే బాగు చేసుకోవాలి

puvvada 04

రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా మన నగరాలను, పట్టణాలను మనమే బాగుచేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. బుధవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో చివరి రోజు నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పట్టణంలో కొనసాగుతున్న పలు పనులను వారు పరిశీలించారు.

సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో మొక్కలు నాటారు. అనంతరం శ్రీనివాస్ నగర్ లో నిర్వహించిన సభలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ ప్రతి రోజు గృహాల నుండి వెలువడే చెత్తను ఎలా తరలించాలో వార్డుల వారిగా పారిశుధ్య ప్రణాళికలు చేసుకోవాలి. పట్టణ ప్రగతిని ఉద్యమ స్పూర్తితో ఎంతో ప్రగతి సాధించాం.

ఎన్నో ఖాళీ స్థలాలు బయట పడుతున్నాయి. శిథిలావస్థలో ఉన్న భవనాలకు ఎలాంటి అనుమతులు అవసరంలేదు. వాటిని భేషరుతుగా కూల్చివేయండి. సతుపల్లిలో ఒక్క పబ్లిక్ టాయిలెట్ కూడా లేదు. వాటి నిర్మాణం కోసం స్థలాలు ఇప్పటికే గుర్తించారని ఎమ్మెల్యే చెప్పారు. ఆయా స్థలంలో వెంటనే నిర్మించాలి.

వెయ్యి మందికి ఒక టాయిలెట్ ఉండే విధంగా ఏర్పాటు చేయాలి.  జూన్ 2వ తేదీకి టాయిలెట్స్ నిర్మాణం ప్రారంభించాలని అన్నారు. డంపింగ్ యార్డ్, నర్సరీ, తుప్పు పట్టిన స్తంభాలు మార్చుట, రోడ్డుకు అడ్డుగా ఉంది, ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫారం లు మార్చడం, లూజ్ వైర్లు సరిచేసే పనులు అన్ని పూర్తి చేసుకోవాలని అన్నారు. పట్టణ పరిశుభ్రతతో పాటు మొక్కలు నాటి, వాటిని పెంచే కార్యక్రమం కూడా అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించాలని  కోరారు.

మున్సిపల్ చైర్ పర్సన్ లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏ లక్ష్యంతో జిల్లా యంత్రాంగం వీటిని సరఫరా చేసిందో అందుకు అనుగుణంగా వీటిని కేవలం మొక్కలను సంరక్షించడానికి నీటిని అందించడానికి మాత్రమే ఉపయోగించుకోవాలని తద్వారా అన్ని మొక్కలు బ్రతికే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ లు స్నేహలత, మదన్ మోహన్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మున్సిపల్ చైర్మన్ కుసంపుడి మహేష్, వైస్ చైర్మన్ తోట సుజల రాణి, మున్సిపల్ కమిషనర్ సుజాత, DCMS చైర్మన్ రాయల శేషగిరిరావు, ఇంచార్జ్ RDO దశరథ్ తదితరులు ఉన్నారు.

Related posts

25 దేవాలయాలకు పాలక మండళ్లు

Satyam NEWS

అనారోగ్యంతో కన్నుమూసిన సి ఐ టి యు నాయకుడు

Satyam NEWS

మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

Satyam NEWS

Leave a Comment