27.7 C
Hyderabad
April 26, 2024 03: 48 AM
Slider మెదక్

కెమికల్ పాలు తయారు చేస్తున్న పవిత్ర డైరీ

#pavitradiary

సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలో పెద్ద ఎత్తున కల్తీ పాలు తయారవుతున్నాయి. పవిత్ర డైరీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నడుస్తున్న ఈ ఫ్యాక్టరీలో కల్తీ పాలు, పెరుగు,పన్నీరు తయారీ చేస్తున్నారు. సహజమైన పాల స్థానంలో కెమికల్ పాలు తయారు చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఈ కంపెనీపై పోలీసులు ఆకస్మిక దాడి జరిపారు. పటాన్ చెరు డీఎస్ పి భీంరెడ్డి నేతృత్వంలో పోలీసు బృందం తనిఖీ చేసినప్పుడు ఆందోళన కలిగించే అంశాలు వెల్లడయ్యాయి.

కెమికల్ తో వివిధ  కంపెనీల బ్రాండ్లతో పాల ఉత్పత్తులను ఈ కంపెనీ తయారీ చేస్తున్నదని డీఎస్ పి భీంరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆధారాలు సేకరించినందున నిర్వాహకులపై చీటింగ్ కేసు నమోదు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. పవిత్ర మిల్క్ డైరి మేనేజర్ ప్రసాద రావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మొత్తం 6 వేల లీటర్ల కల్తీ మిల్క్ ఉత్పత్తులు  సీజ్ చేసినట్లు పటాన్ చెరు డీఎస్ పి భీంరెడ్డి తెలిపారు.

Related posts

బంగారం స్మగ్లింగ్ కేసులో ఎయిరిండియా ఉద్యోగుల అరెస్ట్

Sub Editor

చంద్రబాబుకు అమెరికాలో వైద్య పరీక్షలు

Satyam NEWS

అప్పు తీర్చకపోతే న్యూడ్ ఫొటోలు పెడతామని బెదిరింపులు: యువతి ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment