29.2 C
Hyderabad
September 10, 2024 16: 59 PM
Slider ఆధ్యాత్మికం

పవిత్రోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు: పలు సేవలు రద్దు

#Tirumala

పవిత్రోత్సవాల సందర్భంగా ఈ నెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పలు సేవలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తెలిపింది. ఆగస్టు 14వ తేదీన అంకురార్పణ కారణంగా సహస్రదీపాలంకార సేవ, 15వ తేదీన తిరుప్పావడ, 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.

మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారని టీటీడీ అధికారులు చెప్పారు. శ్రీవారి ఆలయంలో ఏడాది మొత్తం జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గాని తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వాటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

Related posts

రిజిగ్నేషన్: హిందువులను వేటాడి చంపినా మాట్లాడరా

Satyam NEWS

హైదరాబాద్ లోనూ ప్రచారం

Murali Krishna

హైదరాబాద్ లో ఫుట్ బాల్ స్కేటింగ్ వరల్డ్ కప్ త్వరలో

Bhavani

Leave a Comment