31.2 C
Hyderabad
February 11, 2025 21: 31 PM
Slider ఆంధ్రప్రదేశ్ ముఖ్యంశాలు

అందుకే పవన్‌ కళ్యాణ్‌ను రంగంలోకి దింపారు

Roja

టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చం‍ద్రబాబునాయుడు పెయిడ్‌ ఆర్టిస్టులతో ఆడిన డ్రామాలు బట్టబయలు కావడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను రంగంలోకి దింపారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్‌ ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. నాటి నుంచి నేటి వరకు చంద్రబాబుకు అనుకూలంగానే పవన్ కళ్యాణ్ పని చేస్తున్నాడని అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఐదేళ్లపాటు చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతిపై పవన్‌ కళ్లుమూసుకున్నారంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో వంద రోజుల్లో జరిగిన అభివృద్ధి కనపడటం లేదా అని ప్రశ్నించారు. 100రోజుల్లోనే 80 శాతం హామీలు అమలయ్యాయని తెలిపారు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు 151 సీట్లతో వైఎస్‌ జగన్‌ను గెలిపించారని, అది తిరగబడినా 151 అవుతుందని అన్నారు. ఒక సీటు మాత్రమే గెలుచుకున్న పవన్‌ ఆ విషయంపై ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. సీఎం జగన్‌ 100 రోజుల పరిపాలనపై దేశమంతా మెచ్చుకుంటే.. చంద్రబాబు పాఠాలు విని కొత్త రాగాలు ఎత్తుకున్న పవన్‌కు ముఖ్యమంత్రి పరిపాలనపై మాట్లాడే హక్కు లేదన్నారు.

Related posts

NEET పరీక్షలలో ఆల్ ఇండియా 219 వ ర్యాంక్ సాధించిన ఎ.వి.చరణ్

Satyam NEWS

ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి జూపల్లి

Satyam NEWS

సామాజిక బాధ్యత గుర్తుచేసేందుకు 555 కిలోమీటర్ల నడక

Satyam NEWS

Leave a Comment