27.2 C
Hyderabad
December 8, 2023 18: 10 PM
Slider జాతీయం ముఖ్యంశాలు

నదుల ప్రక్షాళణకు పవన్ కళ్యాణ్ బాసట

pawan kalyan

విద్యావేత్త, ఆధ్యాత్మిక గురువు, గంగా ప్రక్షాళణ కోసం పోరాటం చేసి అసువులు బాసిన ప్రొఫెసర్ జి.డి. అగర్వాల్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురువారం సాయంత్రం హరిద్వార్ చేరుకున్నారు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన, రామన్ మొగసే అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్ ఇటీవల హైదరాబాద్ లో జనసేన పార్టీ కార్యాలయాన్ని సందర్శించి పవన్ కళ్యాణ్ తో సమావేశం అయిన సందర్భంలో అగర్వాల్ ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. ఆయన ఆహ్వానం మేరకు పవన్ కళ్యాణ్ హరిద్వార్  వెళ్లారు. సాయంత్రం 4 గంటలకు డెహ్రడూన్ చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి నేరుగా హరిద్వార్  లోని శివారు ప్రాంతంలో ఉన్న  మాత్రి సదన్ ఆశ్రమానికి వెళ్లారు. ఈ ఆశ్రమాన్నే కేంద్రంగా చేసుకుని అగర్వాల్ గంగా ప్రక్షాళణ పోరాటం జరిపారు.  ఆశ్రమ గురూజీ స్వామి శివానంద మహరాజ్, వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ లు శ్రీ పవన్ కళ్యాణ్ ను సాదరంగా ఆహ్వానించారు. గంగా నదిని పరిశ్రమలు, ప్రభుత్వాలు ఏ విధంగా కలుషితం చేస్తున్నాయో ఈ సందర్భంగా శివానంద మహరాజ్ పవన్ కళ్యాణ్ కి వివరించారు. పవన్ కళ్యాణ్ పోరాట స్ఫూర్తి గురించి తాను తెలుసుకున్నానని, గంగా ప్రక్షాళణ పోరాట యాత్రకు ఆయన బాసట కావాలని కోరారు. దక్షిణాది నుంచి గంగా ప్రక్షాళణ పోరాటానికి తగినంత మద్దతు లభించడం లేదని అందువల్ల పవన్ కళ్యాణ్ దానిని భర్తీ చేయాలని కోరారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గంగను కాలుష్యానికి గురిచేయడం అంటే మన సంస్కృతిని కలుషితం చేయడమేనని అన్నారు. తాను పోరాటయాత్రలో ఉండగా జి.డి అగర్వాల్ మరణ వార్త తెలిసిందని ఒక మహత్తర కార్యక్రమం కోసం ఆయన ప్రాణాలు అర్పించడం కలచివేసిందన్నారు. కాలుష్యం నుంచి ఒక్క గంగనే కాదని, భారత దేశంలోని అన్ని నదులను కాపాడుకోవాలని కోరారు. గంగా ప్రక్షాళణ పోరాటం దీనికి నాంది కావాలని అన్నారు. పవన్ కళ్యాణ్ స్వామి నిగమానంద సరస్వతి సమాధిని సందర్శించి అంజలి ఘటించారు. అనంతరం ఆశ్రమం పక్కనే ప్రవహిస్తున్న గంగా నది వద్ద జరిగిన హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు, రేపు పవన్ కళ్యాణ్ హరిద్వార్ లోని పవన్ ధామ్ ఆశ్రమంలో విడిది చేస్తున్నారు. ఆయనతోపాటు రాజేంద్రసింగ్ కూడా అక్కడే బస చేస్తున్నారు

Related posts

కాంట్రవర్సీ నేచర్: తీరు మారని బైంసా నిత్యం ఘర్షణలే

Satyam NEWS

ఆదౌ పూజ్యో గణాధిపః

Satyam NEWS

కాయితిలపై పూటకో మాట గంటకో జిఓ పద్ధతి మానుకోవాలి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!