రాజధాని ప్రాంత రైతులకు, ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత ప్రభుత్వం అవినీతికి పాల్పడి ఉంటే విచారించి చర్యలు తీసుకోవాలి తప్ప ఆ అక్రమాల పేరు చెప్పి రైతుల పొట్ట కొట్టడం మంచిది కాదని ఆయన అన్నారు. రాజధానిలో జరిగిన నిర్మాణాలను పరిశీలించిన పవన్ కల్యాణ్ అనంతరం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం అవినీతి చేసిందని తేలితే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రాంత రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చారు తప్ప టిడిపి కాదు, ఈ విషయాన్ని జగన్ రెడ్డి గుర్తుంచుకుని రాజధాని ఇక్కడే ఉండేలా ప్రకటన చేయాలి ,అభివృద్ధి వికేంద్రీకరణ కు మేం వ్యతిరేకం కాదు.. ఇష్టానుసారంగా చేస్తామంటే ఊరుకోం, రాజధాని విషయంలో అవసరమైతే ప్రధాని మోడీ, అమిత్ షా లను కలుస్తాం, ప్రభుత్వం సానుకూలంగా స్పందించక పోతే ఎంత దూరమైనా పోరాటం చేస్తాం అంటూ పవన్ కల్యాణ్ హెచ్చిరించారు. మంత్రి బొత్స సత్యనారాయణ పరిస్థితులను అర్థం చేసుకుని వ్యాఖ్యలు చేస్తే బాగుంటుందని ఆయన హితవు పలికారు. అమరావతి రాజధాని ప్రకటించినప్పుడు జగన్ కూడా అంగీకరించారనే విషయం మరచిపోరాదని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రభుత్వ పనితీరుపై వంద రోజుల వరకు మాట్లాడకూడదు అని మేం భావించినా.. ప్రభుత్వం మేము మాట్లాడేలా చేసిందని ఆయన అన్నారు.
previous post
next post