30.2 C
Hyderabad
February 9, 2025 21: 07 PM
Slider కడప

వైసీపీ నాయకులకు పవన్ కల్యాణ్ హెచ్చరిక

#pavankadapa

వైసీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ గాలివీడు ఎంపీడీఓ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరామర్శించారు. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించి వైసీపీ నేతల దాడికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓ జవహర్ బాబుకు, కుటుంబసభ్యులకు ‘‘ నేనున్నాను.. ధైర్యంగా ఉండమని’’ పవన్ భరోసా ఇచ్చారు. అనంతరం ఉపముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. అధికారులపై దాడి చేయడం వైసీపీకి కొత్త కాదని మండిపడ్డారు.

ఇది వైసీపీ రాజ్యం అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎంపీడీఓ జవహర్ బాబును అమానుషంగా కొట్టారని జవహర్ బాబుకు హైబీపీతో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పారు. ఎవరి మీదైనా దాడి చేస్తే వైసీపీ ప్రభుత్వంలా చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇష్టారాజ్యంగా అధికారులపై దాడి చేస్తే ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఘటనా స్థలానికి సీఐ వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్ కాలేదని అన్నారు. అహంకారంతో దాడి చేస్తే తోలు తీసి కూర్చోపెడతామని హెచ్చరించారు. వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయని అన్నారు. ఇది కూటమి ప్రభుత్వం.. వైసీపీ కాదని గుర్తుపెట్టుకోవాలని చెప్పారు.

‘‘మాకు మిమ్మల్ని ఎలా నియంత్రించాలో తెలుసు.. చేసి చూపిస్తాం’’ అని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ అని కాదు ఎవరైనా సరే ఆధిపత్య ధోరణిలో ఎవరి మీద చేసినా ఇలాగే స్పందిస్తామని అన్నారు. పరారీలో ఉన్నవారి కోసం పోలీసులు గాలిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఇకపై నెలకో జిల్లా చొప్పున పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పవన్ నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఏడాది నుంచి జనం మధ్యకు వెళ్లేలా పవన్ ప్రణాళికలు చేసుకున్నారు.

జిల్లాల్లోని సమస్యలు, ప్రజల స్థితిగతులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును ప్రత్యక్షంగా పరిశీలించేలా ప్లాన్ చేసుకున్నారు. ప్రజలతో నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడనున్నారు. ఆయా జిల్లాల్లో వెనుకబడిన, గ్రామీణ ప్రాంతాల్లో క్యాంప్ చేసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. తన కార్యాలయ అధికారులకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.

Related posts

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నర్సింగ్ ఆఫీసర్స్

Satyam NEWS

శ్రీశైలం రిజర్వాయర్ కు పెరుగుతున్న వరద నీరు

Satyam NEWS

మంద కృష్ణ మాదిగను పరామర్శించిన ఆర్ఎస్పి ప్రతినిధుల బృందం

Satyam NEWS

Leave a Comment