27.7 C
Hyderabad
April 26, 2024 03: 01 AM
Slider నెల్లూరు

మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు ఒకటో తేదీన జీతాలు చెల్లించాలి

#VenkatagiriMunicipality

మున్సిపల్ పర్మినెంట్ ఉద్యోగులు ప్రతి నెల ఒకటో తారీకు న ఎలా జీతాలు తీసుకుంటున్నారు అలాగనే మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు కూడా ప్రతి నెల ఒకటో తారీఖున వేతనాలు చెల్లించాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జాన్ అన్నారు.

బుధవారం నాడు వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికుల తో ధర్నా  సందర్భంగా జాన్ మాట్లాడారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఆప్కాస్ నిదానం తీసుకొనివచ్చి కాంట్రాక్ట్ మున్సిపల్ కార్మికులకు ప్రతి నెల వేతనాలు చెల్లించే విధానం తీసుకుని వచ్చారని కానీ మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రెండు నెలలు పూర్తి అవుతున్న కాంట్రాక్ట్ కార్మికులకు నేటికీ వేతన బకాయిలు చెల్లించలేదని విషయాన్ని మున్సిపల్ అధికారులకు ప్రశ్నించగా వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జాన్ అన్నారు.

అదేవిధంగా మున్సిపల్ కార్మికుల వేతనాలు నుండి ప్రతి నెల 1340/- రూపాయలు ఈపిఎఫ్ కింద కట్ చేస్తున్నారని, అట్టి డబ్బు కడప లోని పిఎఫ్ ఆఫీస్ కు పంపించాల్సి ఉండగా గత మూడు సంవత్సరాల నుండి  కార్మిక శాఖ కు జమ చేయలేదని జాన్ అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో జాన్ తో పాటు యూనియన్ నాయకులు, మున్సిపల్ వర్కర్స్ పాల్గొన్నారు.

Related posts

రెడ్ హాండెడ్: ఏసీబీకి దొరికిన మరో రెవెన్యూ లంచగొండి

Satyam NEWS

రచ్చ రాజేసిన ప్రధాని మోడీ పంజాబ్‌ టూర్

Sub Editor

పోక్సో కేసులు అధికంగా నమోదవడం వల్లే దిశ జాగృతి యాత్ర

Satyam NEWS

Leave a Comment