28.2 C
Hyderabad
April 20, 2024 11: 02 AM
Slider నిజామాబాద్

పన్నులు చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించండి

pay tax

గ్రామాలు అభివృద్ధి చెందాలంటే పంచాయతీలకు ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించాలని బిచ్కుంద మండల పంచాయతీ అధికారి మహబూబ్ అన్నారు. బిచ్కుంద మండలంలోనీ ఫథలాపూర్ గ్రామంలో మంగళవారం కార్యదర్శులు నిర్వహిస్తున్న పన్నుల వసూలు ప్రత్యేక డ్రైవ్ ను ఆయన పర్యవేక్షించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మండలంలో 8 ప్రత్యేక బృందాలు  తయారుచేసి గ్రామాల్లో పన్నులు వసూలు చేస్తున్నామన్నారు. పన్నుల వసూలు పర్యవేక్షణ అధికారులుగా సూపరింటెండెంట్ సుధీర్ రెడ్డి, ఎంపీడీవో ఆనంద్ పర్యవేక్షిస్తున్నారని అన్నారు.

మండలంలో ఆయా గ్రామాల్లో నూరు శాతం పన్నులు వసూలు చేయడానికి కృషి చేస్తామని ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించడం వల్ల గ్రామంలో అన్ని రకాల మౌలిక వసతులు సమకూర్చడానికి వీలుకలుగుతుందని అన్నారు. ప్రజలు పన్నులు చెల్లించి అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. ఆయన వెంట కార్యదర్శులు శంకర్, సర్ఫరాజ్, పండరీ, సంజు, రామప్ప తదితరులు ఉన్నారు.

Related posts

మఠాష్: 60 లక్షల రూపాయల గుట్కా దగ్ధం

Satyam NEWS

వరిధాన్యం కొనుగోలుకు మార్కెట్ యార్డు చొరవ

Satyam NEWS

ఇండియా విజన్ డాక్యుమెంట్ విడుదల చేయనున్న చంద్రబాబు

Satyam NEWS

Leave a Comment