34.2 C
Hyderabad
April 19, 2024 22: 16 PM
Slider ముఖ్యంశాలు

పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ అరెస్టు అప్రజాస్వామికం

#Mallu Ravi

పిసిసి అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు అయిన కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం దారుణమని పిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మల్లు రవి అన్నారు. మంజీరా డ్యామ్ సందర్శనకు వెళుతున్న పిసిసి అధ్యక్షుడిని, ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అరెస్టు చేయడం పోలీసు రాజ్యం నడుస్తున్నదనడానికి నిదర్శనమని ఆయన అన్నారు.

ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేసి తెలంగాణ రాష్ట్రంలో ఏక పార్టీ పాలన కిందికి తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నదని ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు అని డాక్టర్ మల్లు రవి అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా సాగే ఆందోళనలను కూడా అణచి వేసేందుకు కేసీఆర్ ప్రయత్నించడం చూస్తుంటే తెలంగాణలో ప్రజాస్వామ్యం కరవైనట్లు కనిపిస్తున్నదని ఆయన అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి ల అరెస్టులను తీవ్రంగా ఖడిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Related posts

ట్రాపర్స్ అరెస్ట్: తండా గ్యాంగ్ రేప్ కేసులో 8మంది అరెస్ట్‌

Satyam NEWS

మైనర్ బాలికపై వాలంటీర్ అత్యాచారం

Satyam NEWS

ధర్డ్ వేవ్ లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

Satyam NEWS

Leave a Comment