27.7 C
Hyderabad
April 26, 2024 05: 04 AM
Slider వరంగల్

ముగ్గురు గంజాయి స్మగ్లర్లపై పీడీ యాక్ట్

#pdact

పర్కాల పోలీస్ స్టేషన్  పరధిలో గంజాయి స్మగ్లింగ్ పాల్పడుతున్న  ముగ్గురు నిందితులపై వరంగల్ పోలీస్ కమిషనర్ పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీచేసారు. గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ములుగు జిల్లా, వెంకటపురం మండలం, లక్ష్మీ దేవి పేట్ చెందిన కమ్మగాని రాం మూర్తి, కమ్మగాని చందుతో పాటు జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా టేకుమట్ల మండలం, పెద్దంపల్లి గ్రామానికి చెందిన బొల్లికొండ రాజయ్యలపై వరంగల్ పోలీస్ కమిషనర్ జారీచేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను గురువారం పర్కాల ఇన్స్ స్పెక్టర్ పి.కిషన్ నిందితులకు ఖమ్మం జిల్లా కారాగారంలో అందజేసి వారిని చర్లపల్లి జైలుకు తరలించారు.

పీడీయాక్ట్ అందుకున్న నిందితులు రెండు మాసాల క్రితం వరంగల్  పోలీస్ కమిషనరేట్ లోని పర్కాల పోలీస్ స్టేషన్  పరిధిలో ఆంధ్ర నుండి భద్రాచలం మీదుగా పర్కాలకు గంజాయిని తరలిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి వీరి నుండి 65 కేజీల గంజాయితో పాటు గూడ్స్ రవాణా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా వరంగల్ పోలీసు కమిషనర్ డా. తరుణ్ జోషి మాట్లాడుతూ, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి రవాణా మరియు విక్రయాలు జరిపి యువతను మత్తు పదార్థాలకు బానిసలను చేస్తే వారిపై పీడీయాక్ట్ క్రింద కేసులు నమోదు చేయబడుతాయని హెచ్చరించారు. యువత కూడ మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్తు నాశానం చేసుకోవద్దని మరియు ఎవరైనా గంజాయి సేవించినట్లైతే వారిపై కూడ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Related posts

రష్యాకు ఆయుధాలు సరఫరా చేసేవారిపై కట్టడి చర్యలు

Satyam NEWS

చిన్న విషయంలో కత్తులతో దాడి: మహిళ మృతి

Bhavani

ఈ పోరాటం ఇంతటితో ఆగదు: బాలకృష్ణ

Satyam NEWS

Leave a Comment