39.2 C
Hyderabad
March 29, 2024 14: 09 PM
Slider కరీంనగర్

సిరిసిల్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పీస్ కమిటీ మీటింగ్

sircilla police

సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో పోలీసు అధికారుల ఆధ్వర్యంలో “పీస్ కమిటీ మీటింగ్”లను ఏర్పాటు చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీసుల ఆధ్వర్యంలో  జరిగిన “పీస్ కమిటీ మీటింగ్”నకు హాజరయ్యారు. ఈ సమావేశంలో సిరిసిల్ల లోని హిందూ,ముస్లిం మతాలకు చెందిన మత  పెద్దలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని మతాల పెద్దలు పోలీసువారికి సహకరించాలని కోరారు. సోషల్ మీడియాలో మత కలహాలను సృష్టించే విధంగా, విషపూరిత పుకార్లను నమ్మవద్దని కోరారు. నిజ నిజాలు తెలియకుండా మీకు  వచ్చిన అసత్యపు  సోషల్ మీడియా సందేశాలను దాని గురించి నిజామా అబద్దమా అని ఆలోచించకుండా ఇతరులకు షేర్ చేయకుడదన్నారు.

దాని వలన ఎలాంటి ప్రమాదమైన జరగవచ్చు కావున ప్రశాంత మైన  వాతావరణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని మతాల వారు అన్ని వర్గాల వారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా  పోలీసులకి  సహకరించాలని  అన్నారు. ప్రజా భద్రత, లా & ఆర్డర్  సమస్యలు తలెత్తకుండా ప్రజలు శాంతి యుత జీవనం గడిపేలా చూడడం  రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం అన్నారు.

చట్టవ్యతిరేక కా,ప్రజా శాంతి కి భంగం కలిగించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. సిరిసిల్ల జిల్లా  ప్రజలు అన్నదమ్ముల వలే కలిసి ఉండి ఎలాంటి సంఘటనలకు తావు లేకుండా అందరికి,అన్ని ప్రాంతాల వారికీ  ఆదర్శంగా నిలివాలని కోరారు. ఈ కార్యక్రమంలో లో టౌన్ డీఎస్పీ చంద్రశేఖర్, రూరాల్ సి.ఐ సర్వర్, ఏస్. ఐ లు శ్రీనివాస్, సూదీర్ రావు పాల్గొన్నారు.

Related posts

కర్నూలు జిల్లాలో కరోనా అవగాహన ర్యాలీ

Satyam NEWS

కిల్లింగ్ మిస్టరీ: దివ్య హత్య కేసులో కొత్త మలుపు

Satyam NEWS

రెండవ విడత పల్లె ప్రగతిపై అవగాహన సమావేశం

Satyam NEWS

Leave a Comment