28.2 C
Hyderabad
April 20, 2024 13: 38 PM
Slider మహబూబ్ నగర్

పేకాట డెన్ లో దొరికిన కొల్లాపూర్ మాజీ, తాజా నేతల అనుచరులు

#Kollapur Police

కరోనా దెబ్బకు అందరూ విలవిలలాడుతుంటే కొల్లాపూర్ లోని పెద్ద రాజకీయ నాయకుల అనుచరులు మాత్రం పేకాటతో కాలక్షేపం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం లోకి రాగానే ముందుగా పేకాట డెన్ లను నిషేధించారు. మరి అదే పార్టీలో ఉండి స్థానిక నాయకులు పేకాట డెన్ లలో ఎలా అడుతున్నారో వారిని పెంచి పోషిస్తున్న నాయకులకే తెలియాలి.

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్  టీఆర్ఎస్ పార్టీలో రెండు వర్గాలు ఉన్నాయనేది అందరికి తెలుసు. మనకు తెలియనిది ఏమిటంటే అది పైపైకి మాత్రమే… పేకాట వద్ద మాత్రం కాదు. కొల్లాపూర్ నియోజకవర్గం లోని రెండు టీఆర్ఎస్ వర్గాలు ఒకరంటే ఒకరికి పడనట్లు వుంటారు కానీ పేకాట దగ్గర ఎలాంటి విభేదాలు లేకుండా ఒకే ఆట ఆడుతున్నారు.

మాజీ మంత్రి పిఏ నుంచి అందరూ పట్టుబడ్డారు

కొన్ని రోజుల క్రితం మాజీ మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వర్గీయులు పేకాటలో పట్టుబడ్డారు. మేము ఏమైనా తక్కువనా అంటూ మాజీ మంత్రి పిఏ సోదరుడు కూడా పట్టుబడ్డారు. పేరు పేపర్ల లో రావాలి అనుకున్నారేమో తెలియదు. ఇది వరకు  ప్రజాప్రతినిదులు  కూడా పేకాడుతూ పట్టుబడ్డారు.

అయితే ఎక్కడా మార్పు రావడం లేదు. మొన్న కొందరు పట్టుబడితే, నేడు మరికొంత మంది పట్టుబడ్డారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల గ్రామ పేకాట స్థావరం పై కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వెంకట్ రెడ్డి ఆదేశాలతో పక్క పకడ్బందీగా ఆ మండల ఎస్సై నాగన్న దాడి నిర్వహించారు.

వెంటనే  ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో దగ్గరి ప్రాంతంలో వుండే ఒక మాజీ మంత్రి  పిఎ సోదరుడు ఉన్నట్లు తెలిసింది. మొత్తం మీద ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వివరాలు ఇవి: సలీమ్, శ్రీనివాస్ రెడ్డి, కురుమయ్య, కురుమయ్య, చందు, శ్రీను. అయితే కరోనాపై  జాగ్రత్తలు తీసుకున్నట్లుగా పేకాట రాయుళ్ళు ముందోస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

బైక్,కార్లు, మొబైల్స్  తీసుకు రాలేదు. పెద్ద అమౌంట్ తో కాకుండా మూడు వేల ఒక వంద రూపాయల, మూడు మొబైల్ లతో పట్టుబడ్డారని సిఐ బి.వెంకట్ రెడ్డి, ఎస్ఐ నాగన్న తెలిపారు. వీరి పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

మొత్తానికి కొల్లాపూర్ ఇరువర్గాల పింక్ బ్యాచ్ శ్రేణులు పేకాటనే జీవనోఉపాధిగా పెట్టుకున్నట్లు ఉంది. ఇవ్యవహారం చూస్తుంటే అలాగే ఉందని కొందరు అంటున్నారు. పోలీసులు ఎన్ని సార్లు దాడులు చేసి పట్టుకున్నా ఈ ‘‘నాయకులు’’ మాత్రం పేకాలను వదులుకోలేకపోతున్నారు. పోలీసులు మాత్రం తమకు సమాచారం రాగానే పకడ్బందిగా దాడులు చేసి పట్టుకుంటూనే ఉన్నారు. కేసులు పెడుతూనే ఉన్నారు.

Related posts

గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సైబరాబాద్ సీపీ

Satyam NEWS

కామారెడ్డి జిల్లాకు రేపు ఇద్దరు మంత్రుల రాక

Satyam NEWS

# NotMyKing: బ్రిటన్ లో రాజుకు వ్యతిరేకంగా ప్రదర్శనలు

Satyam NEWS

Leave a Comment