27.7 C
Hyderabad
April 20, 2024 00: 40 AM
Slider కరీంనగర్

చేంజ్ పాలసీ:మాత్రలు వికటిస్తున్న పట్టించు కోరేం

anti dot warms

జగిత్యాల జిల్లా ధర్మపురిలో నులి పురుగు నివారణ మాత్ర‌లు వికటించి ఎనిమిదేళ్ల చిన్నారి సహస్ర మృతి చెందిన ఘటన మరవక ముందే మంగళవారం పెద్దపల్లి జిల్లాలో మాత్రలు వికటించి పదిమంది విద్యార్థులు అస్వస్థతకు గురైనప్పటికీ ప్రభుత్వం లో చలనంలేదు.సోమ‌వారం తెలంగాణ వ్యాప్తం గా అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్న పిల్లలకు నులిపురుగు నివారణ మాత్రలు వేశారు.మాత్రలు వేయగానే పిల్లలు అస్వస్థతకు గురువు తున్నప్పటికీ ఆరోగ్య శాఖ అధికారులు పట్టిచ్చికోవడం లేదు.

ఇందుకు పెద్దపల్లి లో జరిగిన సంఘటనే సాక్షం.పెద్దపల్లి లో నులిపురుగుల నివారణ మాత్రలు వికటించి 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరంతా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమర్‌నగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులు. సోమవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా వైద్య, ఆరోగ్యశాఖ పంపిణీ చేసిన నులిపురుగుల నివారణ మాత్రలను ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంజులత విద్యార్థులకు వేశారు. దీంతో సోమవారంతో పాటు మంగళవారం పలువురు విద్యార్థులకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. కొందరు విద్యార్థులకు వాంతులు కాగా, మరికొందరికి కడుపునొప్పి, తలతిప్పడం వంటి అనారోగ్య సమస్యలు వచ్చాయి.

దీంతో మంగళవారం ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులను ఉపాధ్యాయులు పెద్దపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ వాసుదేవరెడ్డి దగ్గరుండి విద్యార్థులకు వైద్యపరీక్షలు చేశారు. నులి పురుగుల నివారణ మాత్రలు వికటించడం వల్లే విద్యార్థులకు అనారోగ్య సమస్యలు తలెత్తాయని వైద్యులు వెల్లడించారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు.

ఘటనలో విద్యార్థులకు ఎలాంటి ప్రాణనష్టం లేదని వైద్యులు వెల్లడించారు.ఇందుకు పెద్దపల్లి లో జరిగిన సంఘటనే సాక్షం.పిల్లలకు మందులు వేయాలనే అంశం తప్ప వారి మెడికల్ రికార్డ్స్ పరిశీలించక నే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ మాత్రలు వేస్తుండగా చిన్నారులు మాత్రలు వికటించి విలవిలలాడివుతుండగా వారి తల్లిదండ్రులు అందోళన చెందుతున్నారు. అందమైన చిన్నారి సహస్ర మరణ వార్తను తెలుసుకున్న ప్రజలు వైద్య ఆరోగ్య శాఖపై నిప్పులు చెరుగుతున్నారు.చనిపోయాక విచారణ పేరుతో రోదిస్తున్న తల్లిదండ్రులను ప్రశ్నిచడం మానుకోవాలని కోరుతున్నారు.

పాఠశాలల్లో విద్యార్థులను భయపెడుతూ మొక్కుబడిగా మాత్రలు వేయకుండా వారి మెడికల్ హిస్టరీ వారి వారి తల్లి దండ్రు లను అడిగి తెలుసుకుని ఈ మాత్రలు వేయాలని వైద్యులు మరియు నిపుణులు కోరుతున్నారు.పెద్దపల్లి లో 10 మంది అస్వస్థతకు గురైన పిల్లలను అబ్సెర్వేషన్ లో ఉంచగా అక్కడి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వారిని పరామర్శించారు.చేతులు కాలాక ఆకులూ పట్టుకున్నట్లు కాకుండా భవిష్యత్తు ఉన్న విద్యార్థులకు మాత్రలు వేసేప్పుడు జాగర్తలు తీసుకోవాలని ,చనిపోయిన సహస్ర ను ఎలాగూ బతికించలేము కాబట్టి ఆ కుటుంబానికి ఎక్సగ్రేషియా ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

Related posts

బౌద్ధుల పవిత్ర స్థలంలో సినిమా క్లబ్ ఏర్పాటు చేస్తారా?

Satyam NEWS

కొల్లాపూర్ పట్టణ చరిత్రను చెరిపేస్తున్నది ఎవరు?

Satyam NEWS

Alter crops: రైతు వేదికలతో పెనుమార్పులకు శ్రీకారం

Satyam NEWS

Leave a Comment