28.7 C
Hyderabad
April 25, 2024 06: 46 AM
Slider కరీంనగర్

ఆక్షన్:గాలిలో కాల్పులు జరిపిన వ్యక్తి అరెస్ట్

peddapalli army men arrested for firing illegally

పెద్దపల్లి జిల్లా ధర్మవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని శాయం పేటలో నిబంధనలకు వ్యతిరేకంగా గాల్లోకి కాల్పులు జరిపిన మాజీ ఆర్మీ ఉద్యోగి ని అదుపులోకి తీసుకున్నట్లు పెద్దపల్లి డిసిపి రవీందర్ పేర్కొన్నారు. శుక్రవారం పెద్దపల్లి ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీసీపీ పి. రవీందర్ మాట్లాడుతూ

ధర్మారం మండలం శాయంపేట లో జనవరి 1వ తేదీన మాజీ ఆర్మీ ఉద్యోగి బద్దం తిరుమల్ రెడ్డి డబుల్ బ్యారెల్ గన్ తో గాల్లోకి కాల్పులు జరిపిన ఆ వీడియో సోషల్ మీడియా లో రావడం తో ఆ సమాచారం మేరకు పెద్దపల్లి ఏసిపి ఆధ్వర్యంలో పెద్దపల్లి సీఐ ధర్మారం ఎస్ ఐ ల ఆధ్వర్యంలో విచారణ జరిపి అతని అదుపులోకి తీసుకుని ,కేసు నమోదు చేయడం జరిగిందని అన్నారు.

గన్ అతని వద్ద ఎక్కడిది అని విచారణ జరపగా 2002 నుండి 2019 వరకు ఆర్మీలో విధులు నిర్వహించి గత సంవత్సరo లో వాలంటీర్ రిటైర్డ్ అయి స్వంత గ్రామం శాయంపేట లో ఉంటున్నాన్ని, ఆర్మీ లో పనిచేసే సమయం లో జమ్ము కాశ్మీర్ రాష్ట్రం నుండి డబుల్ బ్యారల్ (బిబిఎల్) తుపాకీ , 20 రౌండ్స్ అనుమతి పొందడం జరిగిందని బద్దం తిరుమల్ రెడ్డి తెలిపాడు..నిబంధనలకు వ్యతిరేకంగా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా తుపాకిని తన వద్ద ఉంచుకోవడం నేర మని. తుపాకీ ఉపయోగించి ప్రజల ను భయబ్రాంతులకు గురి చేసిన తిరుమల్ రెడ్డిని అదుపులోకి తీసుకుని,అతని వద్ద ఉన్న తుపాకీ,ఆరు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.

ఇందుకు సహకరించిన వారిపై కూడా కేసు నమోదు చేశామని త్వరలో అదుపులోకి తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలోపెద్దపల్లి ఏసీపీ హబీబ్ ఖాన్, పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, ధర్మారం ఎస్సై ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.

Related posts

విద్యార్ధులచే పోలేరమ్మ హుండి ఆదాయం లెక్కింపు

Satyam NEWS

టిడ్కో గృహాలు కేటాయించాల‌ని టీడీపీ ఆందోళ‌న‌

Sub Editor

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పై అసహనం

Bhavani

Leave a Comment