చావులోనైనా బతుకు లోనైనా చివరిదాకా కలిసే ఉంటామన్న పెళ్లినాటి ప్రమాణాలను నిలబెట్టుకున్నారు ఆ దంపతులు.వృద్ధాప్యానికి తోడు అనారోగ్యంతో పడే బాధలు తాళలేక జీవితంపై విరక్తి చెంది పురుగు మందు తాగి వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన హృదయవిదారక సంఘటన ఓదెల మండలంలో చోటు చేసుకుంది.
పొత్కపల్లి పోలీసుల కథనం మేరకు వివరాల్లోకి వెళ్లితే మడకకు చెందిన గుడిపాటి సాయిరెడ్డి(85), అతని భార్య సూర్యమ్మ(80) నారోగ్యం తో పాటు ముసలి తనం లో తమ పనులు తాము చేసుకోలేక విరక్తి తో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బంధువుల పెళ్లి వేడుకకు వెళ్లిన కుమారుడు వెంకటరెడ్డి, కోడలు ఇంటికి తిరిగి వచ్చి చూడగా అర్థరాత్రి వృద్ధులు మృతి చెందిన విషయాన్ని గమనించారు.
ఈ మేరకు కుమారుడు వెంకట్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై అబ్దుల్‌నయీమ్ తెలిపారు.కలిసే దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాదం నెలకొంది.