సమకాలీన తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని, తెలంగాణ మాండలికం వాడుతూనే తెలంగాణా కథని సరిహద్దులు దాటించిన రచయిత పెద్దింటి అశోక్ కుమార్. తెలంగాణ ఉద్యమ సమయంలో టాంక్ బండ్ మీద జరిగిన మిలియన్ మార్చ్ నేపథ్యంగా పెద్దింటి అశోక్ కుమార్ రాసిన నవల ’లాంగ్ మార్చ్’. ఈ పుస్తక పరిచయ సభ 8 వ తేదీ ఆదివారం పది గంటలకు తెలుగు యూనివర్శిటీ ఆడిటోరియంలో జరగనుంది. ఆన్వీక్షికి ప్రచురణ సంస్థ ద్వారా ప్రచురితమైన ఈ నవల పరిచయ సభలో ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, గంటా చక్రపాణి, దేశపతి శ్రీనివాస్, కె. శ్రీనివాస్, కట్టా శేఖర్ రెడ్డి, టంకశాల అశోక్, మామిడి హరికృష్ణ, నందిని సిధారెడ్డి, కె.పి.అశోక్ కుమార్ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ చిత్రకారుడు లక్ష్మణ్ ఏలే తన లైవ్ పెయింటింగ్ ద్వారా తెలంగాణ ఉద్యమ చిత్రాన్ని చిత్రీకరించడం ప్రత్యేక ఆకర్షణ. అంతే కాకుండా తెలంగాణ ఉద్యమ గీతాలతో పలువురు గాయకులు ప్రేక్షకులను ఆలరించనున్నారు.
previous post
next post