నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో కారం నూనెతో విద్యార్థులకు భోజనం వడ్డించారు అనే విషయం మీద నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి ఈరోజు విచారణ నిర్వహించారు. సంబంధిత వంట కార్మికులకు, ప్రధాన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు ఈ మేరకు తగిన సూచనలు తగిన సూచనలు ఇచ్చారు. రేపటి నుండి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. మధ్యాహ్నం భోజన కార్మికులకు చెల్లించవలసిన బకాయిలకు ఇప్పటి వరకు 58.69 కోట్ల రూపాయలను జిల్లా విద్యాశాఖ అధికారులకు విడుదల చేశారు. ఇంకో రూ.18 కోట్లు 5వ తేదీ నాడు విడుదల చేయడం జరుగుతుంది. ఒకటి నుండి 8 తరగతి వరకు చెల్లించవలసిన వంట ఖర్చులు, వంట కార్మికులకు వెయ్యి రూపాయల వేతనం జూన్ నెల వరకు చెల్లించారు. ఈ చెల్లింపులు ప్రతినెల చేస్తారు. అదే విధంగా వంట కార్మికులకు చెల్లిస్తున్న 2,000/ ల వేతనం బిల్లుల చెల్లింపుల కోసం జూన్ నెల వరకు నిధులు విడుదల చేశారు. జూలై నెల వేతనం చెల్లింపు కోసం నిధులు రేపు విడుదల చేస్తారు.
previous post