27.7 C
Hyderabad
April 24, 2024 09: 12 AM
Slider విజయనగరం

ట్రాఫిక్ క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌, పెండింగ్ చ‌లానాల‌పై దృప్టి

pending challan1

ఏపీలో ట్రాఫిక్ పోలీసులు జూలు విదుల్చుతున్నారు. కరోనా పుణ్యమా ఇన్నాళ్లూ అయ్యో పాపం అంటూ నియమనిబంధనలను అతిక్రమిస్తూ వాహనాలపై ఇక నుంచీ దృష్టి సారిస్తున్నారు. ఇటీవలే రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో ట్రాఫిక్ క్రమబధ్ధీకరణపై దృప్టి పెట్టిన పోలీసులు. ఇక నుంచీ మరింతగా దృష్టి సారిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాలు, ట్రాఫిక్ డీఎస్పీ సూచనల మేరకు విజయనగరం ట్రాఫిక్ ఎస్ఐలు హరిబాబు నగరంలోని కోట జంక్షన్ వద్ద ట్రాఫిక్ నియమనిబంధనలను అతిక్రమించిన వారికి చలానాలు విధించే పనిలో పడ్డారు.

డిజిటలైజేషన్ ప్రకారం స్మార్ట్ ఫోన్ లో పట్టుకుని వాహనం నెంబర్ ప్రకారం చూస్తే..ఒక్కొక్క రూ నాలుగైదు చలానాలు చెల్లించకుండా ఉన్నట్టు చూపించడంతో అటు వాహనం నడిపేవారు, ఇటు ట్రాఫిక్ పోలీసులు కాసింత ఆశ్చర్యానికి గుర‌య్యారు. కొంతమందిని సమీపంలోని ఈ సేవలో కట్టేయాలని సూచించడంతో వెనువెంటనే పెండింగ్ చలానాలు కట్టి చూపించడంతో ట్రాఫిక్ ఎస్ఐ హరిబాబు వాహ‌నాల‌ను తిరిగి వారికి అంద‌జేశారు. ఇలా దాదాపు కోట జంక్షన్ వద్ద..గంటసేపు ట్రాఫిక్ రూల్స్ వాయలేషన్ పై అవగాహన తో పాటు పెండింగ్ చలానాలు చెల్లించే చర్యలను ట్రాఫిక్ పోలీసులు చేపట్టారు.

Related posts

రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల మానవహారం

Satyam NEWS

సోషల్ మీడియా ద్వారా విషప్రచారాన్ని తిప్పి కొడతాం

Satyam NEWS

స్థానిక సంస్థల ఎన్నికలపై గవర్నర్ తో ఎస్ఈసీ భేటీ

Satyam NEWS

Leave a Comment