30.7 C
Hyderabad
April 16, 2024 23: 57 PM
Slider ఆదిలాబాద్

పెన్ గంగ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

#penganga

ఆదిలాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడుగా ఎగువన ఉన్న మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు పెన్ గంగ నది ఉద్ధృతిగా  ప్రవహిస్తున్న నందున పెను గంగ నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, జైనాథ్ పిఏసీఎస్ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి సూచించారు.

పెన్ గంగ నది ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపద్యంలో శుక్రవారం పెన్ గంగ నది ప్రవాహాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గత రాత్రి 7.30 గంటల సమయంలో 80 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం నెలకొందని, అది రాత్రి 11 గంటలకు  94 వేల క్యూసెక్కులకు పెరిగిందని అన్నారు. 

కానీ శుక్రవారం ఉదయం నది ఉద్ధృతి తగ్గి, 70 వేల క్యూసెక్కులకు వరద ప్రవాహం తగ్గిందని తెలిపారు. కానీ 2005లో నదీ పరీవాహక గ్రామాలు నీట మునిగాయని గుర్తు చేశారు. కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి అత్యవసరమైన జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు రాజకీయ నాయకులను సమాచారం అందించాలన్నారు.

Related posts

చోరీ…. చోరీ: విద్య‌ల‌ న‌గ‌రమా ? దొంగ‌ల న‌గ‌ర‌మా ?

Satyam NEWS

జాతీయస్థాయి గోల్డెన్ యారో అవార్డుకు ఎంపికైన స్కౌట్ విద్యార్థులు

Bhavani

గౌతంపూర్‌కు జాతీయ పురస్కారం పట్ల అభినందనలు

Satyam NEWS

Leave a Comment