27.7 C
Hyderabad
April 25, 2024 09: 09 AM
Slider ముఖ్యంశాలు

అందుబాటులోకి అధిక పింఛను ఆన్లైన్ దరఖాస్తు

#epfo

సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈపీ ఎఫ్ పరిధిలోకి వచ్చే అర్హులైన ఉద్యోగులు, కార్మికులు, పింఛ నుదారులు అధిక పింఛను పొందేందుకు యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇచ్చేందుకు ఈపీఎఫ్ వో ఆన్లైన్లో దరఖాస్తును అందుబాటులోకి తెచ్చింది. ఉద్యోగుల పింఛను పథకం -1995 చట్టసవరణకు ముందుగా (2014 సెప్టెంబరు 1కి ముందు) ఈపీఎఫ్ చందాదారుగా చేరి, ఆ తరువాత సర్వీసులో కొనసా గుతూ అధిక వేతనంపై ఈపీఎఫ్ చందాచెల్లిస్తూ ఈపీఎస్ చట్టంలోని పేరా నం.11(3) కింద ఉమ్మడి ఆప్షన్ ఇవ్వలేకపో యిన వారు అర్హులని పేర్కొంది. యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇచ్చేందుకు గడువు మే 3గా పేర్కొంది. ఈ గడువు లోగా అర్హులైన ఉద్యోగులు, కార్మికులు, వేతనజీవులు ఉమ్మడి ఆప్షన్ నమోదు చేయాలని స్పష్టం చేసింది. వేతనజీవులు, పింఛనుదారులు ఈపీఎఫ్ మెంబర్ పోర్టల్ హోం పేజీలో ప్రత్యేక లింకును ఈపీఎఫ్ వో  ఏర్పాటు చేసింది. హోంపేజీలో అప్లికేషన్ ఫర్ జాయింట్ ఆప్షన్ లింకును క్లిక్ చేయాలి. ఆ తరువాత ఈపీఎస్ చట్టం 11(3) కింద ఆప్షన్కు దరఖాస్తును క్లిక్ చేయాలి. ఈ దర ఖాస్తును భవిష్యనిధి యూనివర్సల్ అకౌంట్ నంబరు (యూఏ ఎన్) ఖాతాద్వారా పూర్తిచేయాలి. చందాదారు ఆధార్ నంబరు, పుట్టిన తేదీ వివరాలు ఈపీఎఫ్ వో రికార్డుల ప్రకారం నమోదు చేయాలి. ఆధార్ తో అనుసంధానమైన మొబైల్ నంబరు ఉండాలి. 4దశల్లో వివరాలు పూర్తిచేశాక దరఖాస్తు నంబరు వస్తుంది.

Related posts

మంచోళ్లను ముందు పెట్టి పెద్దోళ్లు దోచుకుతింటున్నారు

Satyam NEWS

తిరుపతి లోక్‌సభ టీడీపీ అభ్యర్థి ప్రకట‌న

Sub Editor

సిరిమానోత్సవం:  కంట్రోల్ రూమ్ నుండి ఎస్పీతో పర్యవేక్షించిన కలెక్టర్

Satyam NEWS

Leave a Comment