30.7 C
Hyderabad
April 19, 2024 10: 28 AM
Slider ప్రత్యేకం

ఉన్న పళంగా పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. ..

#RTCticket

ఆకస్మాత్తుగా పెరిగిన చార్జీలతో ప్రయాణీకులు గగ్గోలు..!

కండక్టర్…..విజయనగరం కు టిక్కెట్ ఇవ్వండంటూ ఓ ప్రయాణీకుడు..యాభై అయిదు రూపాయలు ఇచ్చాడు.. వెంటనే ఆ బస్సు కండక్టర్…70 ఇవ్వాలని చెప్పడంతో ఆ ప్రయాణికుడు ఖంగు తిన్నాడు. ఉదయమే పెరిగిన చార్జీల కనుగుణంగా అయిదు రుపాయలు అదనంగా టిక్కెట్ తీసుకున్న ఆ ప్రయాణీకుడు..తిరిగి రామభద్రపురం నుంచీ విజయనగరం ప్యాసింజర్ బస్సు ఎక్కడంతో కండక్టర్ డెబ్బై అని చెప్ప డంతో చేసేది లెక్క.. అంతే ఖరీదు ఇచ్చి టికెట్ తీసుకున్నాడు..తీరా ఉదయం తీసుకున్న టిక్కెట్ సాయంత్రం కు అమాంతం 20 పెరగడమేంటని టిక్కెట్ తీసుకున్న తర్వాత ఆ ప్రయాణీకుడు సదరు కండక్టర్ ను ప్రశ్నించారు.

ఆ కండక్టర్ చెప్పిన సమాధానంతో ఆ ప్రయాణీకుడు తో పాటు బస్సు లో ప్రయాణించే తోటి ప్రయాణీకులు విని నిశ్య్చేష్ఠులయ్యారు.మధ్యాహ్నం విజయనగరం డిపో లి టిమ్స్ (టికెట్ ఇష్యూ మిషన్ సిస్టం కు మార్చారని..దాంతో.. ప్యాసింజర్ టిక్కెట్లు కాస్త ఎక్స్ ప్రెస్ అయ్యాయని..అలాగే ప్యాసింజర్ బస్సు ను..ఎక్స్ ప్రెస్ అంటూ చెప్పాలని అలాగే ఎక్స్ ప్రెస్ ఖరీదు టిక్కెట్లు ఇవ్వాలని..డిపోలోని టిక్కెట్లు విభాగం ఆదేశాలతో,..ఆర్టీసీ డీఎం సూచనలతో సిబ్బంది అంతా ఇలా చేస్తున్నామని..ఆ ప్రాసింజర్ బస్సు కండక్టర్ చెప్పడం విశేషం.

ఇంతకీ ఆ ప్రయాణీకుడు మరెవ్వరో కాదు.. ఓ జర్నలిస్ట్. ఇదీ మేటర్..విజయనగరం లో ఆర్టీసీ అధికారులు తీరు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ శాఖ లో అన్ని డిపోలలో ఇదే తంతు కొనసాగినట్టు సమాచారం. చూడాలి మరి ఇటువంటి పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వం సామాన్య ప్రజానీకానికి ఏ సమాధానం చెబుతుందో..వెయిట్ అండ్ సీ.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా

Related posts

రఘురామ ఫిర్యాదును హక్కుల కమిటీకి పంపిన లోక్ సభ స్పీకర్

Satyam NEWS

గాల్వన్‌ లోయలో త్రివర్ణ పతాకం రెపరెపలు

Sub Editor

కొత్తగా జిల్లాలో కలిసిన పోలీసు స్టేషన్ లను తనిఖీ చేసిన విజయనగరం ఎస్పీ దీపిక

Satyam NEWS

Leave a Comment