33.2 C
Hyderabad
April 26, 2024 01: 38 AM
Slider విజయనగరం

ప్రతీ ఒక్కరిలో భయం…అందుకే బయటకొస్తే… మాస్క్ తొనే…!

#VijayangaramSP

కరోనా సెకండ్ వేవ్ భయమో..లేక..పోలీసులు జరీమాన విధిస్తారామోనని భయమో….విజయనగరం జిల్లా ప్రజలలో ప్రతీ ఒక్కరూ మాస్క్ తోనే కనిపించండం విశేషం.

రెండు రోజుల క్రితమే.. వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం… జిల్లాలో… మళ్లీ కరోనా కేసులు పెరిగి ఆ సంఖ్య కాస్త నాలుగు పదులకు చేరింది.

దాంతో ఇక లాభం లేదనుకుని స్వయంగా జిల్లా ఎస్పీ రాజకుమారీ… ఉదయం.. సాయంత్రం అకస్మాత్తుగా రోడ్ల మీదకు వచ్చి మాస్క్ ల పై అవగాహన కల్పించడంతో పాటు జరీమాన విధిస్తామని మౌఖికంగా హెచ్చరించారు కూడ.

చెప్పడమే కాక మాస్క్ లేని వారికి స్వయంగా మాస్క్ లు ఇచ్చి కరోనా సెకండ్ వేవ్ పట్ల అందరికీ మౌఖికంతో పాటు చేతులతో సాయం చేసి మరీ జిల్లా ప్రజలను హెచ్చరించారు.

దీంతో కరోనా సెకండ్ వేవ్..మనకే వస్తే..అమ్మో అన్న భయంతో.. బయటకు వస్తున్న ప్రతీ ఒక్కరూ మాస్క్ పెట్టుకోవడం కనిపించింది.

ఏ ఒక్కరైనా మాస్క్ లేకుండా కనిపిస్తారేమోనని మీడియా కూడా రోడ్ల మీదకు వచ్చింది.

దీంతో జిల్లా ప్రజలు యావన్మందీ మాస్క్ లు పెట్టుకుంటున్నారు. దీంతో హేట్సాఫ్… ఎస్పీ..అలాగే హేట్సాఫ్ టూ పోలీస్ శాఖ.

Related posts

భవిష్యత్తులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహిస్తా

Satyam NEWS

కరోనా కట్టడి కి వైద్యులతో రాజంపేట డీఎస్పీ భేటీ

Satyam NEWS

గంజాయి మత్తుకు బానిసై జీవితాలు నాశనం

Satyam NEWS

Leave a Comment