గ్రామంలో సిసి రోడ్లు వేయాలని ఎంత మొరపెట్టుకున్నా ప్రభుత్వ అధికారులు వినడం లేదు……. చినుకు పడితే చిత్తడి…. ఇంట్లో నుండి బయటకు రావాలంటే భయం… నాసిరకం సిసి రోడ్లు వేసి…నడవకుండా కంకర తేలి… ప్రజలు నడవలేని స్థితిలో ఉన్న రోడ్లు…. ఏం చేయాలి?
ఈ ప్రభుత్వాన్ని నమ్ముకోవడం కన్నా సొంతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికే ఆ గ్రామస్తులు ఉపక్రమించారు. ఈ గ్రామాన్ని చూసి ప్రభుత్వమే సిగ్గుపడాలి. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామం కథ ఇది.
ఈ గ్రామంలో స్వచ్ఛంద సిసి రోడ్ల పథకానికి ఆ గ్రామ సర్పంచ్ శ్రీకారం చుట్టారు. ప్రజలు కష్టాలను పాలకులకు విన్నవించుకున్నా పట్టించుకోని సందర్భంలో స్వచ్ఛందంగా ఎవరి ఇంటి ముందు వారు సిసి రోడ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు.
గ్రామం రోడ్డు దౌర్భాగ్యం గా ఉంది అని అన్న వారిని వేధించారు తప్ప పాలకులు రోడ్డు వేయలేదని గ్రామస్తులు తెలిపారు. ఇక ఇప్పుడు ఈ పాలకులు ఆ గ్రామంలో రోడ్డు వేయాల్సిన అవసరం లేదు…. వారే వేసుకుంటున్నారు.